Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ : ఆధార్ తో మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చట !
By: Tupaki Desk | 19 Nov 2021 4:30 PM GMTఆధార్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు ఆధార్ కార్డ్ నెంబర్ తో భీమ్ యూపీఐ ద్వారా డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. కరోనావైరస్ కారణంగా మనదేశంలో ఆన్ లైన్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కాలేజీ ఫీజుల నుంచి కిరాణా స్టోర్ లలో కొనుగోలు చేసే నిత్యవసర సరుకుల పేమెంట్స్ వరకు అన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. అయితే, ఈ సదుపాయం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల ఫోన్‌లకు మాత్రమే ఉంది. ఉదాహరణకు, స్మార్ట్ ఫోన్ లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ అడ్రస్ లేని వారికి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడం కష్టంగా మారింది.
అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి, 'భీమ్'ని ఉపయోగించే వ్యక్తులు ఫోన్ లేదా, యూపీఐ అడ్రస్ లేని వారికి ఆధార్ నెంబర్‌ని ఉపయోగించి డబ్బు పంపవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. భీమ్ అనేది యూపీఐ, ఆధారిత యాప్. ఇందులో మొబైల్ నంబర్, పేరుతో మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే యూఐడీఏఐ ప్రకారం.. ఇకపై భీమ్ యాప్ లో లబ్ధి దారుల అడ్రస్ విభాగంగాలో ఆధార్ నెంబర్ ను ఉపయోగించి మనీని సెండ్ చేయొచ్చు. భీమ్ లోని లబ్ధిదారుల చిరునామాలో ఆధార్ నంబర్ ని ఉపయోగించి డబ్బు పంపే ఆప్షన్ కనిపిస్తుంది.
భీమ్‌లో ఆధార్ నంబర్ ని ఉపయోగించి లబ్ధిదారుని 12 అంకెల ప్రత్యేక ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి వెరిఫై బటన్ ను క్లిక్ చేయాలి. దీని తర్వాత, సిస్టమ్ ఆధార్ లింకింగ్, లబ్ధిదారుల చిరునామాను ధృవీకరిస్తుంది. యూఐడీఏఐ అందించిన సమాచారం ప్రకారం వినియోగదారుడు నగదును పంపొచ్చు. అలా పంపిన నగదు లబ్ధి దారుడి అకౌంట్‌లో మనీ క్రెడిట్ అవుతుంది. అలాగే, చెల్లింపులను స్వీకరించడానికి ఆధార్ పే పీఓఎస్ ని ఉపయోగించే వ్యాపారులకు డిజిటల్ చెల్లింపు చేయడానికి ఆధార్ నంబర్,వేలిముద్రను ఉపయోగించాలి. ఒకవేళ, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉండి, ఆ అకౌంట్ లకు ఆధార్ తో లింక్ చేయబడితే, అటువంటి పరిస్థితిలో అన్ని అకౌంట్ లను డబ్బుల్ని సెండ్ చేయొచ్చని యూఐడీఏఐ తెలిపింది.