Begin typing your search above and press return to search.

బాబు పెళ్లి కోసం బాబుని కలిసిన బాబు!

By:  Tupaki Desk   |   13 May 2015 9:37 AM GMT
బాబు పెళ్లి కోసం బాబుని కలిసిన బాబు!
X
గతంలో స్నేహితులు, సన్నిహితులు, పార్టీ పరంగా కూడా బందువులూ అయిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ రోజు కలిశారు! అలా అయిన రాజకీయ ప్రాముఖ్యత కలిగిన విషయం ఏమీకాదులెండి! వీరిద్ధరి మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత ద్వేషాలు ఏమీలేవన్న విషయం అందరికీ తెలిసిందే! అయితే తన రెండవ కుమారుడు మంచు మనోజ్ వివాహం మే 20న జరగనున్న నేపథ్యంలో ఆ వివాహానికి హాజరుకావాలని చంద్రబాబుని కుటుంబ సమేతంగా ఆహ్వానించారు మోహన్ బాబు. ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కుటుంబసమేతంగా చేరుకున్న మోహన్ బాబు ను... చంద్రబాబు దంపతులు సాధరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం మనోజ్ వివాహానికి హాజరుకావాలని చంద్రబాబు కుటుంబసభ్యులను మోహన్ బాబు కుటుంబం ప్రేమతో ఆహ్వానించింది.
కాగా... మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థం మార్చి 4న జరిగిన సంగతి తెలిసిందే! అయితే వీర్ వివాహ ముహూర్తం మే 20 గా పెద్దలు నిర్ణయించారు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న మనోజ్ - ప్రణీతలు ల ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి పెళ్లికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే!