Begin typing your search above and press return to search.
మరో ఖండన ప్రకటన చేసిన మోహన్ బాబు టీమ్!
By: Tupaki Desk | 4 July 2019 10:51 AM GMTఇది వరకూ టీటీడీ బోర్డు చైర్మన్ పదవి విషయంలో మోహన్ బాబు పేరు ప్రచారంలోకి రావడాన్ని ఆయన టీమ్ ఖండించింది. ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మోహన్ బాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేఫథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కనుందని ప్రచారం జరిగింది.
టీటీడీ బోర్డు చైర్మన్ పదవి విషయంలో పలువురు పేర్లు ప్రచారంలోకి రాగా వారిలో మోహన్ బాబు పేరు కూడా వినిపించింది. అయితే ఆ ప్రచారంపై మోహన్ బాబు తరఫు నుంచి ఖండన విడుదల అయ్యింది. తను ఏ పదవినీ ఆశించడం లేదని అప్పుడు మోహన్ బాబు పేర్కొన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ రేసులో తను ఉన్నట్టుగా జరిగిన ప్రచారాన్ని ఆయన అలా ఖండించారు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మోహన్ బాబు పేరు మరో పదవి విషయంలో వినిపిస్తూ ఉంది. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మోహన్ బాబుకు అవకాశం దక్కనుందని మరో ప్రచారం సాగుతూ ఉంది. ఈ పదవి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయిన పలువురు సినిమా వాళ్ల పేర్లు వినిపించాయి. అందులో భాగంగా మోహన్ బాబు పేరు కూడా వినిపిస్తూ ఉంది.
అయితే ఈ ప్రచారాన్ని కూడా మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండిస్తూ ఉంది. మోహన్ బాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవినీ ఆశించడం లేదని స్పష్టం చేస్తూ ఉన్నారు.