Begin typing your search above and press return to search.
పాక్ చైనాలకు ఒకేసారి ఇచ్చి పడేసిన మోడీ
By: Tupaki Desk | 19 May 2023 10:29 PM GMTదాయాది పాకిస్తాన్. భారత్ తో వేయేళ్ళ యుద్ధం అయినా చేస్తాను. అదీ కాశ్మీర్ కోసం అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చిన పాక్. భారత్ అంటే నిలువెల్లా కసితో రగిలే పాక్ ఇపుడు అన్ని రకాలుగా దిగజారి ఆర్ధికంగా పతనం అయిన ఉన్నా భారత్ చేటు కోరుకునే పాక్ ఒక వైపు ఉంది. ఇక తన సరిహద్దు దేశాలలోని ప్రాంతాలను అదే పనిగా ఆక్రమించుకుని కలుపుకుని పోవాలన్న దురాశతో ఉన్న చైనా. ఈ రెండూ విడివిడిగా కలివిడిగా భారత్ మీద ఇండైరెక్ట్ గానూ డైరెక్ట్ గానూ ఫైటింగ్ కి దిగుతున్నాయి.
దాంతో జపాన్ గడ్డ మీద నుంచి ఈ రెండు దేశాలకు మోడీ తనదైన వార్నింగ్ తో ఇచ్చి పడేశారు. పాకిస్థాన్ తో చర్చలు తాము కోరుకుంటామని అంటూనే ఒక ఒక కండిషన్ అన్నారు. పాకిస్థాన్ తక్షణం ఉగ్రవాదానికి సాయం ఆపేయాలని మోడీ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెడితే తప్ప భారత ఆ దేశంతో చర్చలు జరపబోదు అని ఆయన స్పష్టం చేశారు.
ఒకే ఒరలో శాంతి, ఉగ్రవాదం ఇమడవు అని మోడీ పేర్కొన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం గోవాలో జరిగినపుడు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు. అయితే ఆయన అక్కడ ఉండగానే ఉగ్రవాదంతో ఎపుడూ భారత్ యుద్ధం చేస్తూనే ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పేశారు. అంతే కాదు బిలావల్ భుట్టో షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా నమస్కారం పెట్టి ఊరుకున్నారు.
ఇపుడు మోడీ సైతం అదే చెబుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తక్షణం వీడాలని ఆయన కోరారు. చైనా విషయంలో అదే చెప్పారు సరిహద్దుల్లో ప్రశాంతత శాంతికి తాము కోరుకుంటున్నామని, ఆ పని చైనా చేయాల్సిందే అని అన్నారు. అలా చైనా చేయడం వల్ల రెండు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా అది మేలు చేస్తుందని అన్నారు. పరస్పరం గౌరవించుకోవడం, సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం వంటివి చైనా చేయాలన పనులు అని మోడీ చెప్పుకొచ్చారు.
ఉక్రెయిన్ రష్యాల మధ్య ఏ వైపు తాము మొగ్గు చూపబోమని, తాము శాంతి వైపే ఉంటామని భారతదేశ విదేశాంగ విధానం ఏంటో మోడీ వివరించారు. జపాన్ తో తమ దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సహజ న్యాయం ఇవే జపాన్ తో భారత్ ని కలసి ఉండేలా చేస్తున్నాయని మోడీ అన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటప్పట్లో పాకిస్థాన్ తో భారత్ చర్చలు జరపదు అని తేలిపోతోంది. దానికి కారణం పాక్ వైఖరే అని అర్ధం అవుతోంది. పాకిస్తాన్ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే ధోరణి మానుకోకపోతే మాత్రం భారత్ ఎపుడూ చర్చలకు డోర్స్ తెరవదు అనే అంటున్నారు మోడీ.
ఇదిలా ఉండగా జపాన్‌లో జరుగనున్న జీ-7 సదస్సుకు హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ హిరోమిషా కు వచ్చారు. ఆ సదస్సు కంటే ముందు నిక్కీ ఆసియా అనే పైనాన్షియల్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని భారత వైఖరి, అంతర్జాతీయ సంబంధాలు. పాక్ తో చైనాతో ఉన్న రిలేషన్స్ అన్నింటి మీద మనసులో ఉన్నది చెప్పేశారు.