Begin typing your search above and press return to search.

‘కిసాన్​ యోజన’ పెట్టిన చిచ్చు.. బెంగాల్​ లో మోదీ x దీదీ

By:  Tupaki Desk   |   26 Dec 2020 6:00 AM GMT
‘కిసాన్​ యోజన’ పెట్టిన చిచ్చు..  బెంగాల్​ లో  మోదీ x దీదీ
X
పీఎం కిసాన్​ యోజనపై నరేంద్ర మోదీ .. పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం సాగింది. దేశంలోని రైతులందరికీ కేంద్ర ప్రభత్వం సాయం చేస్తుంటే.. కుటిల బుద్ధితో పశ్చిమబెంగాల్​కు ఆ నిధులు రాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని మోదీ ఆరోపించారు. ఆ మేరకు ఆయన ఓ టీవీ ప్రసంగంలో మాట్లాడారు. ‘ భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులందరికీ సాయం చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ‘ప్రధాన్​మంత్రి కిసాన్​ యోజన’ అనే ఓ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.18వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది.

ఈ పథకంతో దేశంలోని 9 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్​ అమలవుతున్నది. కానీ బెంగాల్​లో మాత్రం ఈ పథకం అమలు కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారు’ అంటూ నరేంద్ర మోదీ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై దీదీ కూడా తీవ్రంగా స్పందించారు. తమ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం కావాలనే నిధులను ఆపేసిందని ఆమె ఆరోపించారు. రైతులకు మేలు జరగకుండా రాష్ట్రప్రభుత్వం అడ్డుకోలేదని.. కేంద్రం కావాలనే పశ్చిమబెంగాల్​కు పీఎం కిసాన్​ నిధి మంజూరు చేయడం లేదని ఆమె ఫైర్​ అయ్యారు.

మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన రూ. 85 వేల కోట్ల నిధులు రాకుండా కేంద్రం అడ్డుపడుతున్నదని.. ఇందులో రూ. 8 వేల కోట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ‘ప్రధాని మోదీ రైతులను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రజలకు అన్నిఅ వాస్తవాలు చెప్పారు. సగం నిజమే చెప్పి రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆమె ఆరోపించారు.