Begin typing your search above and press return to search.

ప్రధాని మోదీకి సెరావిక్ గ్లోబల్, ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ లీడర్ షిప్ అవార్డు ..

By:  Tupaki Desk   |   27 Feb 2021 7:40 AM GMT
ప్రధాని మోదీకి సెరావిక్ గ్లోబల్, ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ లీడర్ షిప్ అవార్డు ..
X
భారత ప్రధాని నరేంద్రమోడీ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోబోతున్నారు. ఐహెచ్ ఎస్ సంస్థ అందించే సెరవిక్ గ్లోబల్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ లీడర్ షిప్ అవార్డును అందుకోనున్నారు. వచ్ఛేవారం హూస్టన్ లో జరగనున్న వార్షిక అంతర్జాతీయ మహాసభలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు దీని నిర్వాహక సంస్థ ఐహెచ్ ఎస్ మార్కిట్ ప్రకటించింది. మార్చి 1 నుంచి 5 వరకు వర్చ్యువల్ గా జరగనున్న కాన్ఫరెన్స్ లో ఆయనకు అవార్డు ప్రదాన ప్రకటన చేయనున్నట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ వైస్ చైర్మన్, కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డేనియల్ ఎర్జిన్ తెలిపారు.

ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చడంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు నేతృత్వం వహిస్తున్న ప్రధాని మోదీకి ఈ సెరావిక్ గ్లోబల్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ లీడర్ షిప్ అవార్డును ఇవ్వడం సరైందే అని డేనియల్ ఎర్జిన్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఇంధన అవసరాలకు సంబంధించి భవిష్యత్ వ్యూహం వంటివాటితో భారత దేశం గ్లోబల్ ఎనర్జీ, ఎన్విరాన మెంటల్ శక్తిగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ఇంధన, పారిశ్రామిక అధిపతులు, అధినేతలు,నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ఫైనాన్సియల్ నేతలు, ఇతర రంగాలలోని ప్రముఖులు పాల్గొననున్నారు.

ఇది ఈ సంస్థ నిర్వహిస్తున్న 39 వ మహాసభ. డేనియల్ ఎర్జిన్ తో ప్రధాని మోదీ ప్రత్యేక ప్లీనరీలో కూడా పాల్గొననున్నారు. ఇంధనం, పర్యావరణ రంగాలలో మోదీ చేసిన, చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.టెక్నాలజీ, ఎనర్జీ, పాలసీ, ఫైనాన్షియల్ వంటి వివిధ రంగాల్లో జరుగుతున్న కృషిని హైలైట్ చేస్తూ ప్రతి ఏడాదీ ఈ కాన్ఫరెన్స్ ను హూస్టన్ లో నిర్వహిస్తున్నారు.