Begin typing your search above and press return to search.

తెలంగాణలో రాజ‌కీయ అస్థిర‌త‌.. మోడీ వ్యూహం ఇదే!!

By:  Tupaki Desk   |   9 March 2023 12:05 PM GMT
తెలంగాణలో రాజ‌కీయ అస్థిర‌త‌.. మోడీ వ్యూహం ఇదే!!
X
ఔను! తెలంగాణ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏం కోరుకుంటున్నారు? ఆయ‌న అస‌లు తెలంగాణ‌ను ఏం చేయాల‌ని భావిస్తున్నారు? అంటే.. అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నార‌నేది స‌మాధానం. అయితే.. దీనికి ముందు.. మోడీ ఏం చేస్తున్నార‌నేది ప‌రిశీలిస్తే.. తెలంగాణలో రాజ‌కీయ అస్థిర‌త సృష్టించ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు మేధావులు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న కేసీఆర్ సెంటిమెంటును కూల‌దోసి.. ప్ర‌జ‌ల‌ను బీజేపీవైపు మ‌ళ్లిం చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. అయితే.. ఇది అంత ఈజీగా జ‌రిగేది కాదు. అందుకే.. ప్ర‌భుత్వా న్నే అస్థిర‌త‌కు గురి చేసి.. స‌ర్కారును అచేత‌నం చేయ‌డం ద్వారా రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌నే వ్యూహాన్ని మోడీ చ‌క్క‌గా అమ‌లు చేస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఢిల్లీలో తాము ఎలానూ అధికారంలోకి రాలేక‌పోయిన నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌శాంతంగా ఎందుకు ప‌నిచేయాల‌నే వ్యూహంతో అస్థిర‌త సృష్టిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ‌పై కూడా.. అదే వ్యూహంతో మోడీ ఉన్నార‌నేది మేధావుల మాట‌.

అదికూడా ఎన్నిక‌ల‌కుముందు ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి.. ప్ర‌జ‌ల‌కు కేసీఆర్‌కు మ‌ధ్య గ్యాప్ పెంచేయ‌డం ద్వారా.. ఆ గ్యాప్‌ను తాము ఫిల్ చేయాల‌నే వ్యూహం క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

ఇదే విష‌యాల‌ను... తాజాగా బీజేపీ నేత‌లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం క‌నిపిస్త‌లేడు.. సీఎం కూతురు కోసం దిగులు పెట్టుకున్న‌డు.. అంటూ.. బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. అంటే.. మోడీ కూడా ఇదే కోరుకుంటున్నార‌నేది స్ప‌ష్టం గా తెలుస్తోంది.

కేసులో ఇరుక్కున్న కూతురుపై ధ్యాస పెడితే.. ఆటోమేటిక్‌గా కేసీఆర్ మాన‌సికంగా దెబ్బ‌తిన‌డం ఖాయ‌మ‌ని.. త‌ద్వారా రాజ‌కీయ అస్థిర‌త ఏర్ప‌డి.. తెలంగాణ‌లో తాము విక‌సించాల‌నే ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.