Begin typing your search above and press return to search.
తగ్గేదేలేదు.. ఉమ్మడి పౌరస్మృతి దిశగా మోడీ సర్కార్ కీలక అడుగు
By: Tupaki Desk | 7 July 2023 10:31 AM GMTఒక దేశం.. ఒక చట్టం దిశగా మోడీ సర్కారు అడుగులు వేయటం తెలిసిందే. ఒకే దేశంలోని ప్రజలకు మతాల వారీగా చట్టాలు ఉండటం ఏమిటి? అందరికి ఒకే చట్టం ఎందుకు ఉండకూడదన్న వాదనకు తగ్గట్లు ఎన్నో ఏళ్లుగా చెబుతున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీ) అమలు దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు తమ వాదనల్ని వినిపిస్తున్నారు. సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
త్వరలో ఈ అంశానికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ బిల్లుకు సంబంధించిన అభ్యంతరాలపై అధ్యయనం చేయటం.. మెజార్టీ వర్గీయుల మద్దతు పొందేందుకు అవసరమైన మార్పులకు సంబంధించి మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అనధికారికంగా ఈ బిల్లుపై వివిధ కోణాల్లో అధ్యయనం చేయటానికి వీలుగా నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన ఒక కమిటీని వేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ కమిటీకి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నేతృత్వం వహిస్తారు. కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్ మేఘ్వాల్ సభ్యులుగా ఉంటారు. యూనిఫారం సివిల్ కోడ్ లో గిరిజన వ్యవహారాలకు సంబంధించి రిజిజు.. మహిళా హక్కులపై స్మ్రతి.. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కిషన్ రెడ్డి.. చట్ట.. న్యాయపరమైన అంశాలపై మేఘ్వాల్ అధ్యయనం చేస్తారు.
నిజానికి ఉమ్మడి పౌరస్మృతి అన్నంతనే మైనార్టీలకు.. మెజార్టీలకు ఒకేలాంటి చట్టం ఉండాలన్న మాట ప్రముఖంగా చెబుతున్నప్పటికీ.. లోతుల్లోకి వెళితే సున్నితమైన మరిన్ని అంశాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైనది గిరిజన.. ఆదివాసీ తెగలకు సంబంధించిన వ్యక్తిగత చట్టాలు ఇప్పుడు పెద్ద అడ్డంకి అన్న వాదనను చాలామంది పరిగణలోకి తీసుకోవటం లేదు.
మైనార్టీలకు.. మెజార్టీలకు ఒకేలాంటి చట్టాలు ఉండాలన్న దానిపై మద్దతు ఇచ్చే వారు సైతం.. ఆదివాసీలు.. గిరిజన తెగలకు ఉండే ప్రత్యేక హక్కులు.. ఉమ్మడి పౌరస్మృతి కారణంగా పోతాయన్న అంశానికి వచ్చేసరికి భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
2019 లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు హామీ ఇచ్చామని.. దాన్ని నెరవేర్చాలన్న మాట బీజేపీ నేతలు స్పష్టం చేయటం తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి ప్రజాభిప్రాయాన్ని కోరుతూ లా కమిషన్ గత నెల 13న పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. గత నెల 23న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే జాతీయ సమగ్రత.. సామాజిక సామరస్యం మరింత బలంగా మారతాయని పేర్కొన్నారు. అయితే.. వీటిపై విపక్షాలు.. ముస్లిం పర్సనల్ లా బోర్డు.. మరికొన్ని ముస్లిం వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం.. తాజాగా నియమించిన అనధికార కమిటీతో.. ఈ ఇష్యూలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుందని చెప్పక తప్పదు.