Begin typing your search above and press return to search.
వివాదాస్పద సినిమాను మోడీ ప్రమోట్ చేయటమా?
By: Tupaki Desk | 6 May 2023 10:03 AM GMTనరేంద్రమోడీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఒక సినిమాను అదీ వివాదాస్పద సినిమాను మోడీ ప్రమోట్ చేశారంటే నమ్మటం కష్టంగా ఉంది. కానీ కర్నాటక ఎన్నికల్లో భాగంగా బళ్ళారిలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతు 'ది కేరళ స్టోరీ' సినిమాలో ఉగ్రవాదానికి సంబంధించిన చేదునిజాన్ని చూపించినట్లు చెప్పారు. కేరళలోని ఉగ్రశక్తుల గురించి ఈ సినిమా బహిర్గతం చేసిందన్నారు. ఓటుబ్యాంకును మాత్రమే నమ్ముకున్న కాంగ్రెస్ ఇలాంటి ఉగ్రవాదులకు మద్దతుగా నిలబడిందంటు మండిపోయారు.
ఉగ్రశక్తులతో కాంగ్రెస్ పార్టీ గుట్టుగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మోడీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే కేరళస్టోరి సినిమాకు కాంగ్రెస్ కు ఏమిటి సంబంధమో అర్ధంకావటంలేదు.
ముస్లింపార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవటమే మోడీ కోపానికి కారణమైందేమో. అయితే ఒకపుడు జమ్మూ-కాశ్మీర్లో ముస్లింపార్టీ పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపింది బీజేపీ. అధికారం కోసం ఏ పార్టీ ఏ పార్టీతో అయినా చేతులు కలపటం మనదేశంలో కొత్తేమీకాదు.
ఇక సినిమా విషయానికి వస్తే కేరళసినిమా కథే బోగస్ అని అర్ధమవుతోంది. ఎలాగంటే ఒక్క కేరళలోనే 32 వేలమంది అమ్మాయిలు ముస్లింలుగా మారిపోయి ఐసిస్ ఉగ్రవాద సంస్ధలో చేరారని సినిమాలో చూపించినట్లుగా ప్రచారం జరిగింది. 32 వేలమంది కేరళ అమ్మాయిలు ఐసిస్ లో చేరారు అని చెప్పటమే సంచలనంగా మారింది.
ముగ్గురో నలుగురో లేకపోతే పదిమంది మతాన్ని మార్చుకుని ఐసిస్ లో చేరారని చెబితే ఏమోలే నిజమే కాబోలని అనుకునే వాళ్ళు. అలాకాకుండా ఏకంగా 32 వేలమందని ముందు ప్రచారం జరిగి ఇపుడు కాదంటున్నారు. దాంతోనే సినిమా మొత్తం బోగస్ అనే విమర్శలు పెరిగిపోతున్నాయి.
ఇలాంటి సినిమా గురించి మోడీ మాట్లాడటం అందులోను ఉగ్రవాదులకు కాంగ్రెస్ కు ముడిపెట్టడమే చాలా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్-ఉగ్రవాదులకు లింకుపెట్టి మోడీ మాట్లాడదలచుకుంటే నేరుగానే మాట్లాడచ్చు. అంతేకానీ మధ్యలో కేరళసినిమాను పిక్చర్లోకి లాగాల్సిన అవసరం, ఆ వివాదాస్పద సినిమాను ప్రమోట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా మోడీ ఆ పనిచేశారంటేనే చాలా చీపుగా ఉంది.