Begin typing your search above and press return to search.
రైతు ఉద్యమంలో మోడీ మార్కు నిరసన
By: Tupaki Desk | 21 Dec 2020 8:10 AM GMTదేశంలో నిరసనలు మామూలే అయినా.. ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని రీతిలో వినూత్న రీతిలో నిరసనలు చేస్తూ కేంద్రం మీద విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నారు రైతులు. మూడు వారాలు ముగించుకొని నాలుగో వారంలోకి అడుగు పెట్టిన రైతు ఉద్యమం మోడీ సర్కారును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గడిచిన ఆరేళ్లలో ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన పరిస్థితిని ప్రధాని మోడీ ఎదుర్కొంటున్నారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు తమ ఉద్యమ పంథాను మార్చుకోకపోవటమే కాదు.. అంతకంతకూ రెట్టించిన ఉత్సాహంతో నిరసనల్ని చేపడుతున్నారు.
అదే సమయంలో దేశ రాజధాని సరిహద్దుల్లో చేపట్టిన రైతు ఉద్యమానికి యావత్ భారతావని మద్దతుగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నిరసన కార్యక్రమాన్ని ప్రకటించారు రైతులు. ఈ నెల 27న ప్రధానికి ఆయనకు అర్థమయ్యే రీతిలో సరికొత్త నిరసనను తెలిపేందుకు డిసైడ్ అయ్యారు. ప్రధాని మానసపుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమం సాగే సమయంలో.. అందరూ పళ్లాలతో చప్పుడు చేస్తూ నిరసన చేయాలని దేశ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని డిజైన్ చేసిన తీరు చూస్తే.. ఇందులో మోడీ మార్కు కనిపించటం విశేషం.
కరోనాపై పోరాటం చేసేందుకు.. దేశంలోని ప్రతిఒక్కరు ఇంటి ముందుకు వచ్చి పళ్లాల మీద చప్పుడు చేయాలని గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపునకు ఆశేష భారతావని ఎంతలా స్పందించిందో తెలిసిందే. తాజాగా అదే బాటలో రైతులు ఇచ్చిన పిలుపు ఏ మాత్రం సక్సెస్ అయినా మోడీ సర్కారుకు ఇబ్బందికి గురి చేయటం ఖాయం. ఇదంతా చూస్తే.. మోడీకి అర్థమయ్యే భాషలోనే.. ఆయన అనుసరించిన విధానాల్నే తమ నిరసనకు మార్గాలుగా చేసుకోవటం ఆసక్తికరమని చెప్పక తప్పదు.