Begin typing your search above and press return to search.
ఎడాపెడా అమ్మేయటమే మోడీ సర్కారు పాలసీనా?
By: Tupaki Desk | 25 Feb 2021 5:05 AM GMTఆణిముత్యాన్ని తలపించే మాట ఒకటి తాజాగా ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చింది. ఏళ్లకు ఏళ్లుగా అమలు చేస్తున్న విధానాన్ని తీసి అవతల పారేసి.. కొత్త తీరును ప్రదర్శిస్తున్న ఆయన మాటలు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రైవేటు రంగ సంస్థలు ఎన్ని ఉన్నా.. ప్రభుత్వ రంగ సంస్థల్నిఆయా ప్రభుత్వాలు నిర్వహించటం చూస్తున్నదే. అయితే.. అలాంటి సంస్థల్ని తీసి అవతల పారేసి.. వాటిని గంపగుత్తగా ప్రైవేటుకు అమ్మేయటం.. దాని ద్వారా వచ్చే లక్షల కోట్లను సంక్షేమం కోసం ఖర్చు పెడతానంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే.
ఈ విషయాన్ని మరింత సింఫుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే.. మీ తాత వంద ఎకరాల భూమిని.. ఐదు కంపెనీల్ని మీ నాన్నకు ఇచ్చారనుకుందాం. తాత వ్యవసాయం చేస్తూనే కంపెనీల్ని స్థాపించి.. రెండింటిని చక్కగా మేనేజ్ చేశారు.. ఆర్థికంగా కుటుంబం మరింత బలోపేతం అయ్యేలా చేశారు. తాత తర్వాత నుంచి నాన్న హయాంలోకి వచ్చాక.. ఆయన వేరే దేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే స్థిరపడ్డారు. ఎందుకీ భూములు.. ఎందుకీ కంపెనీలు అనుకొని వాటిని వచ్చిన కాడికి అమ్మేయటం మంచి పనేనా? లేక.. కుటుంబ పరంపరలో భాగంగా వచ్చిన ఆస్తిని మరింత పెంచుతూ.. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. కొంగొత్త పద్దతుల్లో వ్యవసాయం చేస్తూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తూ.. జన్మనిచ్చిన దేశానికి అంతో ఇంతో పనికి వచ్చే పని చేయటం బాగుంటుందా?
రెండో విషయం గురించి అవగాహన లేనప్పుడు.. మొదటిదే అందరికి నచ్చుతుంది. కానీ.. రెండో పద్దతిలో కాస్త కష్టం ఉండొచ్చు.. కానీ దాని వల్ల కుటుంబానికే కాదు.. చుట్టూ ఉన్న వారందరికి మేలు కలుగుతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రబుత్వం.. పైన పేర్కొన్న పొలికలో మొదటి పద్దతిని ఫాలో అయితే.. బాగుంటుందా? రెండో విధానాన్ని అనుసరించాలా? ప్రభుత్వం వ్యాపారం చేయదు.. పాలన చేస్తుందన్న గంభీరమైన ప్రకటన విన్నంతనే తర్కానికి నిలిచేలా ఉంటుంది. కానీ.. తరచి చూస్తే.. అందులోని డొల్లతనం ఇట్టే కనిపిస్తుంది.
నష్టాలు వచ్చే సంస్థల్ని అమ్మేయటం అన్న మాటలోనే విషయం ఇట్టే అర్థమవుతుంది. వ్యాపారం ఎవరూ నష్టానికి చేయరు. లాభాలకే చేస్తారు. ఒక సంస్థ కొన్నాళ్లు విపరీతమైన లాభాల్లో నడిచి తర్వాత నష్టాల్లోకి కూరుకుపోయిందంటే.. ఏదో మతలబు ఉన్నట్లే. దాన్ని సరి చేస్తే.. విషయం మొత్తం సెట్ అవుతుంది. సమర్థుడైన ప్రధానిగా పేరున్న మోడీ.. అలాంటి అవకతవకల్ని సరి చేసి.. కొత్త విధానాన్ని దేశానికి పరిచయం చేసి.. తన తర్వాత వచ్చే పాలకులకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి.. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తాం.. ఆ డబ్బుల్ని తీసుకొని సంక్షేమానికి ఖర్చు చేస్తానమనటంలో ఏమైనా అర్థముందా? ఎడా పెడా అమ్మేయటం.. ఆస్తుల్ని కరగదీయటం లాంటివి ఒకసారి అలవాటైతే.. తర్వాతి రోజుల్లో ఏం చేస్తారు? అన్నది అసలు ప్రశ్న. దేశ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కాదంటారా?