Begin typing your search above and press return to search.
జమిలికి రోడ్డు మ్యాప్ రెడీ అవుతోందా ?
By: Tupaki Desk | 11 Feb 2021 7:30 AM GMTజమిలి ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి చాలా సీరియస్ గా ఉన్నట్లు అనిపిస్తొంది. జమిలి ఎన్నికల నిర్వహించే విషయంలో స్ఫష్టమైన రోడ్డు మ్యాప్ రెడీ చేయాలని న్యాయ కమీషన్ కు కేంద్రం సూచించింది. జమిలి ఎన్నికలపై వచ్చిన ప్రతిపాదనలను ప్రస్తుతం లా కమీషన్ పరిశీలిస్తోంది. ఇదే విషయమై తాజాగా లా కమీషన్ కు రోడ్డు మ్యాప్ తయీరీ విషయంలో స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
చాలా కాలంగా జమిలి ఎన్నికల నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్రమోడి సీరియస్ గా ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు అవకాశం దొరికినా జమిలిపై ప్రధాని వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. ఇఫ్పటికే వన్ నేషన్..వన్ రేషన్, వన్ నేషన్, వన్ ట్యాక్స్ అనే విధానాలను అమల్లోకి పెట్టిన కేంద్రం వన్ నేషన్..వన్ ఎలక్షన్ అనే పద్దతిని అమల్లోకి తేవాలని సీరియస్ గా ఆలోచిస్తోంది.
మోడి నిర్ణయం తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి ఎలాంటి అభ్యంతరాలు వచ్చేది లేదు. కాకపోతే ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలే తేలాలి. ఇందులో కూడా కేసీయార్, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని ఎవరు అనుకోవటం లేదు. కాకపోతే తమిళనాడు, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఏమంటారో చూడాలి.