Begin typing your search above and press return to search.
ఆరు నూరు అయినా... ఆరవ తేదీన మోడీ కర్నాటకలో...!
By: Tupaki Desk | 4 May 2023 5:00 AM GMTనరేంద్ర మోడీకి ఒక అలవాటు ఉంది ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయడం. ఏకంగా వారం పది రోజుల పాటు అలుపెరగకుండా కలియ తిరగడం. గత తొమ్మిదేళ్ళుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మోడీ ప్రచార బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని పార్టీని గెలిపించుకుని వచ్చారు. అయితే ఇందులో కూడా కొన్ని పరాజయాలు ఉన్నాయి.
రెండేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరిగితే మోడీ ఎంతలా తిరిగినా కూడా అధికారం దక్కలేదు. అలాగే ఢిల్లీ, కేరళ, తమిళనాడు, పంజాబ్ లలో సైతం అలాగే జరిగింది. ఇక ఈ ఏడాది జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో సైతం మోడీ ఎంతలా ప్రచారం చేసినా అధికారాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
ఇక కర్నాటలో నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అపుడే ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. ఆయన ఏడున్నర పదుల వయసులో ఏ మాత్రం విరామం లేకుండా రోడ్ షోలు చేస్తున్నారు. బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నారు. లోకల్ కాంగ్రెస్ నాయకుల మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
కర్నాటకలో పోలింగ్ ఈ నెల 10న జరగనుంది. అంటే గట్టిగా వారం కూడా వ్యవధి లేదు. దాంతో మోడీ ప్రచారాన్ని పీక్స్ కి చేర్చడానికి ఈ నెల ఆరవ తేదీని ఎంచుకున్నారు. ఆ రోజున కనీ వినీ ఎరగని తీరులో మోడీతో మెగా రోడ్ షోని నిర్వహించడానికి బీజేపీ సకల సన్నాహాలు చేస్తోంది.
ఈ మెగా రోడ్ షో లో ఏకంగా నలభై కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తారు. అలాగే ఒకే రోజు పదిహేండు నుంచి ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తారు. ఇప్పటిదాకా దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఏకబిగిన ఎనిమిది గంటల పాటు సాగే ఈ రోడ్ షోలో పది లక్షల మంది ప్రజలు పాల్గొంటారు అని అంటున్నారు.
ఆ విధంగా చూస్తే కనుక మోడీ చేసేది అద్భుతమైన రోడ్ షో అని చెప్పాలి. అది అల్టిమేట్ అని కూడా చెప్పాలి. మోడీ ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఈ రోడ్ షో చేస్తారు అని అంటున్నారు. ఇప్పటికే మోడీ కర్నాటక ఎన్నికల్లో అనేక కీలకమైన నియోజకవర్గాల్లో పర్యటించారు. రోడ్ షోలను నిర్వహించారు.
ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ మీద ఆయన విమర్శల దాడి చేస్తూ వస్తున్నారు. ఇక ఈ నెల 6న మెగా రోడ్ షో తో మోడీ కర్నాటక ఎన్నికల యుద్ధాన్ని క్లైమాక్స్ కి చేరుస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ మహా రోడ్ తో కన్నడ ప్రజలు తమ అభిప్రాయాన్ని పూర్తిగా బీజేపీ వైపుగా మార్చుకుంటారని ఆశాభావంతో ఉన్నారు.
సౌత్ స్టేట్స్ మీద ఈసారి ఫుల్ ఫోకస్ పెడుతున్న బీజేపీకి అధికారంలో ఉన్న కర్నాటక చాలా ఇంపార్టెంట్. అందుకే మోడీ గత వారం నుంచి కర్నాటక మీదనే దృష్టి పెట్టేశారు. ఇక ఆరు నూరు అయినా కన్నడ సీమను కమలం చేజిక్కించుకోవాల్సిందే అన్నదే బీజేపీ పంతంగా ఉంది.