Begin typing your search above and press return to search.
కొరియా ప్రధానికి మోడీ జాకెట్స్.. సెటైర్లు
By: Tupaki Desk | 1 Nov 2018 5:42 AM GMTభారత ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ అయ్యాక విదేశీ టూర్లను కూడా ఇంత ఈజీగా.. సులభంగా చేసేయోచ్చని అందరికీ నిరూపించాడు. కీలకమా.? కాదా అన్న విషయాన్ని పక్కపెడితే.. ఎప్పుడంటే అప్పుడు.. బస్సెక్కినంత ఈజీగా ఫ్లైట్ ఎక్కి మోడీ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. అలా వెళుతూ వెళుతూ ప్రపంచాధినేతల మనసులను చూరగొంటున్నాడు. అంతేకాదు.. వారితో బలమైన స్నేహాన్ని ఏర్పరుచుకుంటున్నాడు..
ఇటీవలే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.. మోడీతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం మరియు ఇతర అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ వేసుకున్న జాకెట్ ను చూసి ముచ్చట పడ్డాడట.. ఇదే విషయాన్ని మోడీకి చెబితే ఆయన కోరిక తీర్చాడట.. తాజాగా బాన్ కీమూన్ కు సరిపోయేలా పలు జాకెట్ లను మోడీ స్వయంగా తయారు చేయించి.. దాని మీద మోడీ జాకెట్ అని పేరు ముద్రించి పంపించాడట..
తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ట్వీట్ చేస్తూ ‘భారత ప్రధాని నరేంద్రమోడీ నాకు కొన్ని అందమైన దుస్తులు పంపారు. వీటిని మోడీ వెస్ట్ గా పిలుస్తారు. సాంప్రదాయ భారతీయ వస్త్రాల తరహాతోపాటు ఆధునిక వెర్షన్లను జోడించి తీర్చిదిద్దిన ఈ దస్తుల డిజైన్లను కొరియాలో కూడా సులభంగా ధరించవచ్చు .. నాకు సరిపోయేలా పంపిన మోడీకి కృతజ్ఞతలు’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. అంతేకాదు.. మోడీ పంపిన జాకెట్లతో ఫొటో దిగి ట్విట్టర్ పెట్టారు.
ఈ పోస్టు చేయగానే కొందరు నెటిజన్లు సెటైర్లతో హోరెత్తిస్తున్నారు. నిజానికి ఈ తరహా జాకెట్లు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సృష్టించినవి.. ఆ జాకెట్లను 2014లో మోడీ కాపీ కొట్టి ‘మోడీ జాకెట్స్’ గా ప్రచారంలోకి తెచ్చాడు. దీన్నే ఉదహరిస్తూ ఇది నెహ్రూ జాకెట్స్ అని నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు.
మోడీ తీరు చూస్తుంటే బ్రిటీషర్లతో కూడా తనే పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడని.. క్రెడిట్ మాత్రం గాంధీకి పోయిందని ప్రచారం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇలా మోడీ జాకెట్స్ మేనియా సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.