Begin typing your search above and press return to search.
మళ్ళీ మోడీయే ప్రధాని...విపక్షంలో భారీ చీలిక
By: Tupaki Desk | 24 April 2023 9:16 AM GMTదేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే కలసికట్టుగానే అన్నది విపక్షాలకు ఇపుడు అర్ధమవుతున్న విషయం. ఓట్ల చీలిక కనుక సాగితే కచ్చితంగా మోడీ మూడవసారి దేశానికి ప్రధానిగా ప్రమాణం చేయడం ఖాయమని కూడా భయం విపక్షాలలో ఉన్నాయి. నిజంగా ఈ రకంగా విపక్షాలలో ఒక కొత్త ఆలోచన రావడం గొప్ప విషయమే. ఇది 2019లో రాలేదు. ఇపుడు వచ్చింది.
దాంతో విపక్షాలను ఏ విధంగా ఏకత్రాటిమీద నడిపించాలి అన్న దాని మీదనే ఇపుడు హాట్ హాట్ డిస్కషన్ విపక్ష శిబిరంలో సాగుతోంది. బీహార్ నుంచి సీఈం జేడీయూ అధినేత అయిన నితీష్ కుమార్ ఇపుడు విపక్ష నేతలను వరసబెట్టి కలుస్తున్నారు. ఆయన ఈ నెల 12న ఢిల్లీకి వెళ్ళి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని కలిశారు. విపక్షాల ఐక్యత గురించి కూడా చర్చించారు.
ఆయనతో మాటల సందర్భంగా కేజ్రీవాల్ ఏమన్నారో తెలియదు కానీ లేటెస్ట్ గా మాత్రం ఆప్ జాతీయ కార్యదర్శి సందీప్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ ఆప్ దేశంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఒక విధంగా ఆప్ విపక్ష కూటమిని షాక్ ఇచ్చేశారు. కేజ్రీవాల్ ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తారా అంటే ఆవిషయం ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చారు.
అంటే ఆప్ సోలో ఫైట్ కే రెడీ అన్న మాట. ఆప్ ఆ విధంగా ఒంటరిగా బరిలోకి దిగడం వల్ల గుజరాత్ లో కాంగ్రెస్ కి భారీ నష్టం ఏర్పడింది. అలాగే గోవాలో అధికారం లోకి రాలేకపోయింది. ఇపుడు ప్రతీ రాష్ట్రంలో ఆప్ పోటీకి దిగితే ఆ వ్యతిరేక ఓట్లు అన్నీ చీలి మరోసారి బీజేపీకి లాభం అన్నదే కాంగ్రెస్ సహా విపక్షాల వాదన. అయితే తాము విడిగా పోటీ చేయబట్టే ఈ రోజున జాతీయ హోదా సాధించామని, చాలా రాష్ట్రాలలో ఉనికి చాటుకున్నామని కూడా ఆప్ చెబుతోంది.
పైగా కాంగ్రెస్ ని ముందు పెట్టి తాము మద్దతు ఇవ్వడం ఆప్ కి ఇష్టం లేదు అంటున్నారు. అలా నితీష్ కుమార్ తొలి రాయబారం ఫెయిల్ అయింది. ఇక ఈ నెల 25న నితీష్ కుమార్ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కలవబోతున్నారు. ఆమెను కాంగ్రెస్ నాయకత్వాన విపక్షాల కూటమిలోకి ఆహ్వానించనున్నారు అయితే ఇటీవల బెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనక వామపక్షాలు, బీజేపీ ఉన్నారని ఆరోపించిన మమత కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోమని చెబుతున్నారు.
మమత సైతం కాంగ్రెస్ నాయకత్వం వద్దు అని అంటున్నారు. దాంతో మమతను ఒప్పించి కాంగ్రెస్ కూటమి వైపు రప్పించడం నితీష్ వల్ల అవుతుందా అన్నదే చర్చగా ఉంది. ఇక ఇప్పటికే మహారాష్ట్రలోని ఎన్సీపీ కూడా కూటమి వ్యతిరేక సంకేతాలు ఇస్తోంది. మోడీ చదువు ఎందుకు అంటూ ఆ మధ్య శరద్ పవార్ ప్రశ్నించి విపక్షాల గాలి తీసేశారు. అలాగే అదానీ దేశంలో పెట్టుబడులు పెడితే నష్టమేంటి అన్న పాయింట్ ని లేవదీశారు.
ఇక కాంగ్రెస్ నాయకత్వాన విపక్ష కూటమిలో నికరంగా ఉండేవి తమిళనాడు నుంచి డీఎంకె, అలాగే ఉద్ధవ్ థాక్రే శివసేన అంటున్నారు. బీయారెస్ ఈ కూటమిలోకి వస్తుందా అంటే తెలంగాణా ఎన్నికల తరువాతనే అంటున్నారు. నితీష్ కుమార్ ని వీరందరితో మాట్లాడమని కాంగ్రెస్ పురమాయించినట్లుగా తెలుస్తోంది.
ఈ బిగ్ టాస్క్ ని పెట్టుకుని నితీష్ కుమార్ రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారు. దేశంలని 543 లోక్ సభ సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షం నుంచి ఒక్కరే పోటీగా ఉండాలన్నది విపక్ష కూటమి నినాదంగా ఉంది. ఆ విధంగా ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయాలని మిగిలిన చోట్ల ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని కూటమి నేతలు ప్రతిపాదిస్తున్నారు.
ఇది ఆప్ లాంటి పార్టీల జాతీయ హోదా ఎదుగుదలకు భంగకరం కాబట్టి వారు నో అనే చెబుతారు. బీయారెస్ కూడా జాతీయ పార్టీగా కావాలనుకుంటోంది. మమత కూడా అదే ఆశతో ఉన్నారు. మొత్తానికి చూస్తే విపక్ష కూటమి అంతా ఏకత్రాటి మీదకు రావడం జరగదని అంటున్నారు. చూడాలి మరి నితీష్ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో.