Begin typing your search above and press return to search.
చాట్ జీపీటీ వివాదాస్పద వ్యక్తుల జాబితాలో మోదీ..!
By: Tupaki Desk | 20 Feb 2023 1:16 PM GMTకృతిమ మేథస్సుతో ఆలోచించే చాట్ జీపీటీలు మన ముందుకు వచ్చేశాయి. అచ్చం మనిషిలా ఆలోచించడం వీటి ప్రత్యేకత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వ్యవస్థతో పని చేసే చాట్ బోట్ ల పనితీరు అద్భుతమైన టెక్నాలజీ నిపుణులు కొనియాడుతున్నారు. అయితే చాట్ జీపీటీ వల్ల ఉపయోగాలు ఉన్నట్లే.. కొత్తగా కాంట్రావర్సీలు సైతం తలెత్తుతున్నాయి.
ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చాట్ బోట్ తో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియాలో పాపులర్ టిఫిన్ ఏంటి? అని అడుగుతూ ఇడ్లీ.. వడ.. దోసె తోపాటు బిర్యానీని చూపింది. టిఫిన్ల జాబితాలో హైదరాబాద్ బిర్యానీని చాట్ జీపీటీ చేర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇది కాస్త వివాదంగా మారడంతో చాట్ జీపీటీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ సత్య నాదెళ్లకు క్షమాపణలు చెప్పింది. అయితే ఈ ఘటన మరువక ముందే చాట్ బోట్ మరో వివాదానికి తెరలేపింది. చాట్ జీపీటీని ఓ నెటిజన్ వివాదాస్పద వ్యక్తులు ఎవరని ప్రశ్నించాడు. దీనికి చాట్ జీపీటీ సమాధానం ఇస్తూ ప్రధాని మోదీ సహా పలువురి ప్రముఖుల జాబితాను వెల్లడించింది.
చాట్ జీపీటీ వివాదాస్పద వ్యక్తుల జాబితాలో నరేంద్ర మోదీతో పాటు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఉన్నారు. అయితే వీరిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సి ఉంటుందని చాట్ జీపీటీ పేర్కొనడం గమనార్హం.
కాగా ప్రముఖ మీడియా బీబీఐ సైతం ఇటీవల గుజరాత్ అల్లర్లపై ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తూ ఇందులో మోదీ హస్తం ఉందనేలా కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై బీజేపీ నేతలతో పాటు మోదీ అభిమానులు మండిపడ్డారు. కేంద్రం ఈ డాక్యుమెంటరీ ప్రసారంపై ఆంక్షలు విధించగా కోర్టు నుంచి బీబీఐ అనుమతి తెచ్చుకొని మరీ ప్రసారం చేసింది. ఈ క్రమంలోనే బీబీసీపై ఇటీవల ఐటీ దాడులు సైతం జరిగాయి.
బీబీఐ పన్ను ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలతో ఐటీ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. అయితే దీనిని ఇరువర్గాలు సైతం దాడులు కాదని సర్వే అని పేర్కొన్నాయి. ఈ వివాదం ఇంకా సమసి పోకముందే కృతిమ మేధస్సుతో నడిచే చాట్ జీపీటీ నరేంద్ర మోదీని వివాదాస్పద వ్యక్తిగా పేర్కొనడం కొత్త చర్చకు తెరలేపింది.
గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి కోర్టు నుంచి క్లీన్ స్వీప్ లభించినప్పటికీ ఆయనను కొందరు వివాదాస్పద వ్యక్తిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అదానీ వ్యవహారంతో బీజేపీ ఇబ్బందులు పడుతుంటే కొత్తగా చాట్ జీపీటీ సైతం తోడు కావడం వారికి తల నొప్పిగా మారుతోంది. దీంతో ఈ వ్యవహరం రాజకీయంగా ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.