Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో మోడీ చిచ్చు.. భారీ స్కెచ్‌!

By:  Tupaki Desk   |   28 Feb 2023 9:00 PM GMT
క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో మోడీ చిచ్చు.. భారీ స్కెచ్‌!
X
క‌ర్ణాట‌కలో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుని.. వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రావాల‌నేది బీజేపీ వ్యూహం. అయితే.. దీనికి మించి.. కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల‌కు.. అగ్నిప‌రీక్ష‌గా మారింది. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రంలో మ‌రోసారివిజ‌యం ద‌క్కించుకుని హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో పాగా వేయాలంటే.. క‌ర్ణాట‌క వంటి రాష్ట్రంలో అధికారంలోకి రావా ల్సిన అవ‌స‌రం ఉంద‌ని గుర్తించారు.

ఈ క్ర‌మంలో సామ‌దానభేద దండోపాయాల‌ను ప్ర‌యోగిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇవి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానంగా కాంగ్రెస్‌ను డైల్యూట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గుర్తించిన‌ట్టుగా ఉన్నారు. అందుకే.. ప్ర‌ధాని మోడీ అప్పుడే క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టేశారు. నిజానికి కాంగ్రెస్ వంటి అతి పెద్ద పార్టీలో అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌డం అనేది అంత ఈజీ అయితే.. కాదు. ఇది.. క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున ఖ‌ర్గేకు ద‌క్కింది.

ఈయ‌న ద‌ళితుడు. పైగా శివ‌మొగ్గ అనే కీల‌క జిల్లాకు చెందిన వారు. ఇక్క‌డ 18 స్థానాలు ఉంటే.. బీజేపీకి గ‌త ఎన్నిక‌ల్లో 16 స్థానాలు ద‌క్కాయి. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖ‌ర్గే అంటే.. సానుకూల, సానుభూతి ప‌వ‌నాలు ఉన్నాయి. వీటిని గ‌మ‌నించిన మోడీ.. త‌న వ్యూహానికి ప‌దును పెంచారు. ఎందుకంటే.. రేపు కాంగ్రెస్ ఇక్క‌డ‌.. మేం ద‌ళితుల‌కు పెద్ద అవ‌కాశం ఇచ్చామ‌ని.. ఖ‌ర్గేకు అధ్య‌క్ష ప‌గ్గాలు అందించామ‌ని ప్ర‌చారం చేసుకునేందుకు వీలు ఉంటుంది.

దీనిని ముందుగానే అంచ‌నా వేసిన మోడీ.. త‌న స్కెచ్‌ను ప్ర‌యోగించారు. ఖ‌ర్గే అంటే త‌న‌కు ఎంతో గౌర‌వం అని చెబుతూనే.. కాంగ్రెస్‌ ప్లీనరీలో ఖర్గేకు అవమానం జరిగిందని అన్నారు. ఆయన్ను నామ్‌కే వాస్తే అధ్యక్షుడిగా చూ స్తున్నారని ఆరోపించారు. కర్ణాటక నేతలను కాంగ్రెస్‌ పార్టీ ప్రథమ కుటుంబం ఎప్పుడూ అవమానిస్తోదంద‌న్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ఖ‌ర్గే పట్ల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీలో వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని అన్నారు. నిజానికి ఖ‌ర్గేపై ప్రేమ‌తో కాదు.. కాంగ్రెస్ ద‌ళితుల‌ను అవ‌మానిస్తోంద‌నే కాన్సెప్టును త‌న‌దైన శైలిలో మోడీ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ప‌రిణామం.. ఆయ‌న‌కు ఎలా మేలు చేస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.