Begin typing your search above and press return to search.
75 ఏళ్ల దేశ చరిత్రలో ఏ ప్రధానికి లేని గుణం మోడీలో..
By: Tupaki Desk | 24 Jun 2021 11:30 AM GMTదేశం ఇప్పటివరకు ఎంతో మంది ప్రధానమంత్రుల్ని చూసింది. కానీ.. మరెవరిలో లేని ఎన్నో గుణాలు మోడీ సొంతం. అయితే.. ఇవన్నీ పాజిటివ్ లే సుమా. మోడీని అమితంగా ప్రేమిస్తూ.. అంతకు మించి ఆరాధించే వారికి కొదవ లేదు. వీరంతా మోడీ మీద ఈగ కాదు కదా.. ఈగ రెక్క టచ్ చేయటాన్ని ఇష్టపడరు. ఇదిలా ఉంటే.. మోడీని వ్యతిరేకించేవారు.. ఆయన తీరును తప్పు పట్టేవారు బోలెడంత మంది. ఓవైపు ఆరాధకులు.. మరోవైపు వ్యతిరేకులు.. ఇలాంటి ప్రత్యేకత నమోకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. గత 75 ఏళ్లలో ఇంతలా గొడవ పడే ప్రధానిని దేశం ఎప్పుడూ చూడలేదన్నారు. ‘ఆయనెప్పుడూ గొడవ పడే మూడ్ లోనే ఎందుకు ఉంటారో ప్రధానిని అడగాలనుకుంటున్నా. పశ్చిమ బెంగాల్.. మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ గొడవే. ప్రధాని ఇలాంటి గొడవలు మానేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఇంటింటికి రేషన్ అందించాలని ఆమ్ ఆద్మీ సర్కారు నిర్ణయించింది. అయితే.. దీనికి కేంద్రం చెక్ పెట్టింది. ఇంటింటికి రేషన్ పథకాన్ని చేపట్టేలా ఢిల్లీ రాష్ట్రం నిర్ణయించిందే తప్పించి.. కేంద్రం అనుమతి తీసుకోలేదన్న కారణాన్ని చూపించి నో చెప్పటాన్ని మనీశ్ తీవ్రంగా స్పందించారు. రేషన్ ఎలా పంపిణీ చేయాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉందన్నారు.
పిజ్జాలు.. బట్టలు.. ఇతర వినియోగ వస్తువులను డెర్ డెలివరీ చేస్తున్నప్పుడు రేషన్ ను ఎందుకు చేయలేమని ప్రశ్నించిన ఆయన.. ఇంటింటికి రేషన్ సరఫరాను జూన్ లోనే ప్రారంభించాలని ఆప్ సర్కారు నిర్ణయించింది. అయితే.. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ మాత్రం ఇంటింటికి రేషన్ ను అమలు చేయలేమంటూ రిజెక్టు చేశారు. ఒకవేళ.. ఈ పథకం అమలై ఉన్నట్లైయితే.. 72 లక్షల మందికి ప్రయోజనం కలిగి ఉండేదన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన కేంద్రం లేవనెత్తుతున్న అంశాల్ని బూచిగా చూపించటం సరికాదంటున్నారు. ఏమైనా మోడీపై ఈ స్థాయిలో విరుచుకుపడే నేతగా మనీశ్ కు మించినోళ్లు లేరనే చెప్పొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.