Begin typing your search above and press return to search.

వివిధ రాష్ట్రాల్లో మోదీ పరిస్థితి ఏంటి.?

By:  Tupaki Desk   |   23 March 2019 5:55 PM GMT
వివిధ రాష్ట్రాల్లో మోదీ పరిస్థితి ఏంటి.?
X
ఎన్నికల టైమ్‌ కాబట్టి ప్రతీ పార్టీ సర్వేలు చేయించుకుంటుంది. ఓటర్ల మనోగతం ఎలా ఉంది, వాళ్లు సంతృప్తిగా ఉన్నారా, లేరా, ఎలాంటి కార్యక్రమాలతో నెగిటివ్‌ ఓట్‌ని పాజిటివ్‌గా మార్చుకోవచ్చు లాంటి అంశాలపై.. ఎన్నికల సమయంలో ప్రతీ రెండు నెలలకు ఒకసారి సర్వేలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ కోవలోనే సీవోటర్‌ ఒక ఆసక్తికర సర్వే చేసింది. వివిధ రాష్ట్రాల్లో మోదీ పరిస్థితి ఏంటి.. ఎంతమంది మోదీ నాయకత్వంపై సంతృప్తిగా ఉన్నారు అనే విషయాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అందరికంటే ఎక్కువుగా జార్ఖండ్ ప్రజలు మోదీపై 74 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ - గోవా - హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి.

ఇక మహారాష్ట్ర, అస్సాం, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్మూకాశ్మీర్‌ ప్రజలు కూడా మోదీ పాలననై సానుకూలంగానే ఉన్నారు. మహారాష్ట్ర 47.9 - అస్సాం 47 - ఉత్తర ప్రదేశ్‌ 43.9 - పశ్చిమ బెంగాల్‌ 43.2 - జమ్మూ కాశ్మీర్‌ 39.6 శాతం మంది ప్రజలు మోదీ పాలనపై ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మోదీ పాలనపై అంత సుముఖంగా లేరు. తమిళనాడులో కేవలం 2.2 శాతం మంది ప్రజలే మోదీ పాలకు ఓటు వేశారు. జయలలిత మరణం, ఆ తర్వాత మోదీ మధ్యవర్తిత్వంతో తమిళ ప్రజల ఆదరణ కోల్పోయారు మోదీ. ఇక కేరళ 7.7 - పుదుచ్చేరిల్లో 10.7 శాతం మాత్రమే మోదీ పాలనకు జై కొట్టారు. ఏపీలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. కేవలం 23.6 శాతం మంది ప్రజలు మోదీకి ఓకే చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువమంది జైకొట్టేవాళ్లు కానీ ఏపీకి ఇచ్చిన హామీలు బీజేపి అమలు చేయకపోవడంతో. గ్రాఫ్‌ దారుణంగా పడిపోయింది.