Begin typing your search above and press return to search.
మోడీ సర్కార్ కీలక నిర్ణయం .. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం .. !
By: Tupaki Desk | 24 Feb 2021 9:38 AM GMTపుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్, డీఎంకే కూటమి ప్రభుత్వం తమ మద్దతు నిరూపించుకోలేకపోయింది. దీనితో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత సీఎం నారాయణ స్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ అక్కడ ఇన్ చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళి సై సౌందర్ రాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ పంపిన ప్రతిపాదకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తెలిపితే అధికారికంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారు.
పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ, ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. వరుసగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ వచ్చారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడి, బలపరీక్షలో నెగ్గలేక కుప్పకూలింది. 30 స్థానాలున్న పుద్చుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థిని కలుపుని 18 మంది సభ్యుల మద్దతుతో నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వారిలో వరుసగా రాజీనామాలు చేశారు. అయితే, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. బలపరీక్ష నిర్వహించడానికి ఒక్కరోజు ముందు మరో ఇద్దరు వైదొలగడంతో.. ఇక 12 స్థానాలకే పరిమితమైంది. అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.