Begin typing your search above and press return to search.
79 సార్లు చప్పట్లు.. 15 సార్లు స్టాండింగ్ ఒవేషన్..? మోదీకి యూఎస్ కాంగ్రెస్ ఫిదా
By: Tupaki Desk | 24 Jun 2023 12:08 PM GMTస్వదేశంలో కాంగ్రెస్ అంటే కాలుదువ్వే ప్రధాని నరేంద్ర మోదీకి.. విదేశంలో అదే కాంగ్రెస్ నుంచి అపూర్వ ఆదరణ దక్కింది. బహుశా ఏ దేశ నాయకుడికీ దక్కనంతటి స్థాయిలో. అందులోనూ అగ్రరాజ్యం అమెరికాలో అంటే ఆశ్చర్యకరమే. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఆ దేశ కాంగ్రెస్ (ఉభయ సభలు)ను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలోనూ ఆయన ఓసారి ప్రసంగం చేశారు.
అయితే, ఈసారి మోదీ మాటలకు సభ్యులు ఫిదా అయ్యారు. సంప్రదాయం ప్రకారం... కాంగ్రెస్ సభ్యులు కొంత మంది వెంట రాగా సభలో ప్రధాని అడుగుపెట్టారు. ఆ వెంటనే చప్పట్లు మార్మోగాయి. సందర్శకుల గ్యాలరీ నుంచి మోదీ మోదీ అంటూ నినాదాలు హోరెత్తాయి.
మోదీ షేక్ హ్యాండ్ ఇవ్వరూ..
మోదీతో షేక్ హ్యాండ్ కు చాలామంది సెనేటర్లు ఉత్సాహం చూపారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ పోడియం మీదకు వెళ్లిన మోదీ కాంగ్రెస్ స్పీకర్ మెకార్తి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, సభ్యులకు అభివాదం చేశారు. ఇంగ్లిష్ లో ఒక్కో అంశాన్ని వివరిస్తూ హావభావాలతో ఆయన ప్రసంగిస్తుంటే సభ్యులు ఆనంద పరవశులయ్యారు.
గంట ప్రసంగం.. 79 సార్లు చప్పట్లు
మోదీ అమెరికన్ కాంగ్రెస్ లో దాదాపు గంట పాటు ప్రసంగించారు. అయితే, ఈ వ్యవధిలోనే సభ్యులు 79 సార్లు చప్పట్లతో స్వాగతించారు. 15 సార్లు లేచి నిల్చొని కరతాళ ధ్వనులు చేశారు. మోదీ ప్రసంగం ముగియగానే స్పీకర్ మెకార్తి, సభ్యులు మోదీ ఆటోగ్రాఫ్, సెల్ఫీ కోసం ఎగబడ్డారు. భారత్, అమెరికా సంబంధాలను స్వాగతిస్తూ సభ్యులంతా హాజరుకావడాన్ని మోదీ ప్రశంసించారు. భారతీయ అమెరికన్ సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో సభకు వచ్చారు. కాగా, 2016 వేసవిలో తాన ఇక్కడకు వచ్చానని.. అప్పటికి ఇప్పటికీ ప్రపంచం ఎంతో మారిందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
అయితే, ఇరు దేశాల సంబంధాలు మారలేదని మెరుపులు మెరిపించారు. భారత్-అమెరికాది నమ్మకమైన భాగస్వామ్యం సూర్యుడు లాంటిది అని.. ప్రపంచంపై అది నవోదయ కాంతులు వెదజల్లాలని ప్రపంచానికి మంచి భవితనివ్వాలని మోదీ ఆకాంక్షించారు. మోదీ ప్రసంగం ముగిశాక చాలాసేపు సభ్యులు నిల్చుని చప్పట్లతో అభినందించారు. మోదీ ప్రసంగం ముగిశాక చాలాసేపు సభ్యులు నిల్చుని చప్పట్లతో అభినందించారు.
స్పీకర్ మెకార్తి సైతం
భారతీయ అమెరికన్ సభ్యుల గురించి మోదీ చెప్పినప్పుడు మాజీ స్పీకరు నాన్సీ పెలోసి నవ్వుతూ రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలవైపు చూస్తూ అభినందించారు. స్పెల్లింగ్‌బీలోనే కాకుండా అన్నింట్లోనూ భారతీయులు మెరికలేనని మోదీ వ్యాఖ్యానించినప్పుడు సభ్యులంతా నవ్వులు పూయించారు. మోదీ సంతకం చేసిన ప్రసంగ కాపీల కోసం మెకార్తి సహా సభ్యులు ఆసక్తి చూపారు.