Begin typing your search above and press return to search.
కర్ణాటక ఎన్నికల ప్రచారానికి టైం ముగిసింది.. అయినా మోడీ వదల్లేదు.. ఏం చేశారంటే
By: Tupaki Desk | 9 May 2023 2:33 PM GMTసాధారణంగా ఎక్కడ ఏరాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఒక టైం అంటూ ఉంటుంది. ఆ సమయానికిమించి ప్రచారం చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించదు. అదేవిధంగా పోలింగ్ జరగడానికి ముందు రోజు ను కూడా అనుమతించదు. అప్పటి వరకు అన్ని పార్టీలు కూడా హోరా హోరీ ప్రచారం చేసి .. మాకంటే మాకే ఓటేయాలని..ప్రజల చెవిలో జోరీగల్లా ఊదరగొడతాయి కాబట్టి.. వారు తేల్చుకునేం దుకు పోలింగ్ జరగడానికి ముందు రోజును కూలింగ్ డేగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అంటే.. పోలింగ్ జరగడానికిముందు రోజులు ప్రచారం వద్దే అర్థం. ముఖ్యంగా కీలకమైన ప్రజలను ప్రభావి తం చేయగల నాయకులు ఎవరూ కూడా ప్రచారం చేయొద్దనే ఎన్నికల నిబంధనావళి చెబుతోంది. అయితే .. మన ప్రధాని మోడీ మాత్రం ఊరుకుంటారా? అవకాశం వున్న అన్ని లైన్ల ను వాడేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయన రోడ్ షో చేశారు. అదేమంటే.. నావెంట ఎవరూ లేరని.. అది రోడ్ షో కాదని సెలవిచ్చారు.
ఇక, కర్ణాటక ఎన్నికలు మే 10(బుధవారం) జరుగుతున్న క్రమంలో 9వ రోజును ఎన్నికల సంఘం కూలింగ్ డేగా నిర్ణయించింది. అయితే.. ఈ రోజు కూడా ప్రధాని కర్ణాటక ప్రజలను వదల్లేదు. బహిరంగ లేఖ రాశారు. ఇలా రాయొచ్చా.. లేదా? అనేది.. ఎన్నికల సంఘం నిబంధనల్లో లేదు. ఎందుకంటే.. ప్రచారం మాత్రమే చేయొద్దన్నారు. ఈ పాయింట్‌ను పట్టుకున్న మోడీ.. చెలరేగిపోయారు.
మోడీ బహిరంగ లేఖ ఇదీ..
'మీరు(కన్నడిగులు) ఎప్పుడూ నాపై ఎంతో ప్రేమ కురిపించారు. ఈ అమృత కాలంలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యంగా పెటుకున్నాం. భారత్ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. మన లక్ష్యం మూడో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా మార్చడమే. ఇది సాధించాలంటే కర్ణాటక వేగంగా అభివృద్ధి చెందాలి. ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి. కరోనా సమయంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏటా 90 వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుడులను పొందింది. గత ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.30 వేల కోట్లుగా ఉంది. మేం పెట్టుబడుల విషయంలో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నాం' అని వెల్లడించారు. దీనికి ఒక వీడియోను జత పరిచారు. ఇదీ..సంగతి!!