Begin typing your search above and press return to search.
బాలథాక్రే వారసత్వాన్ని తుంచేసిన మోడీ అమిత్ షా
By: Tupaki Desk | 19 Feb 2023 8:30 PM GMTసాధారణంగా రాజకీయాల్లో వారసులు అంటే కొడుకులు కూతుళ్ళే. వారే రక్తసంబంధీకులు. వారిని మించిన బంధం ఉండదు. అందువల్ల వారికే పట్టం కడతారు. అయితే ఉమ్మడి ఏపీలో పాతికేళ్ళ క్రితం జరిగిన తెలుగుదేశం పోరులో అల్లుడు నారా చంద్రబాబు ఎన్టీయార్ కి సిసలైన వారసుడిగా నిలిచారు. నాడు ఆయన మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని పార్టీని ప్రభుత్వాన్ని అందుకున్నారు.
సరిగ్గా ఇన్నేళ్ల తరువాత అదే వ్యూహం మహారాష్ట్రలోనూ అమలు చేశారు. బాల్ థాక్రే స్థాపించిన శివసేనకు వారసుడిగా ఉన్న ఉద్ధవ్ థాక్రే నుంచి పార్టీ పగ్గాలను అధికారాన్ని ఏక్ నాధ్ షిండే అనే థాక్రే వారసుడు అందుకున్నారు. ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు. నిజానికి వందకు పైగా సీట్లు వచ్చిన బీజేపీ తనకే సీఎం పోస్టు అని పట్టుబట్టకుండా తెలివిగా వ్యవహరించి శివసేనను చీల్చిన ఏక్ నాధ్ షిండేకు కిరీటం పెట్టింది. దీని వల్ల ఆయనతో పాటు వచ్చిన వారు తనా అలా వెనక్కి వెళ్ళకుండా కట్టుబడిపోయారు.
ఇపుడు చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం కూడా అసలైన శివసేన ఏక్ నాధ్ షిండేదే అని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. దాంతో బాల్ థాక్రే కుమారుడిగా ఉన్న ఉద్ధర్ థాక్రే కి కేవలం రెండున్నరేళ్ల సీఎం సీటు తప్ప మొత్తం అన్నీ పోయినట్లు అయింది తన తండ్రి స్థాపించిన శివసేన మీద హక్కులను అధికారాన్ని ఆయన కాపాడుకోవడంలో విఫలం చెందారు అని కూడా చెప్పాలి.
దాని కంటే ముందు చూస్తే 2019లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ శివసేన రెండూ కలసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో శివసేనకు 55 సీట్లు వస్తే బీజేపీకి 106 దాకా సీట్లు వచ్చాయి. బాల్ థాక్రే పెట్టిన నియమం ప్రకారం ఎక్కువ సీట్లు వచ్చిన వారు సీఎం సీటుని పొందుతారు. అయితే దాన్ని తుంగలోకి తొక్కిన ఉద్ధవ్ థాక్రే సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ కాంగ్రెస్ ఎన్సీపీలతో చేతులు కలిపి సర్కార్ ని ఏర్పాటు చేశారు.
అయితే రెండున్నరేళ్ళు తిరగకుండా ఆయన్ని మాజీ సీఎం చేయడంతో మోడీ షాలు విజయం సాధించారు. ఏక్ నాధ్ షిండేను తమ వైపునకు తిప్పుకుని ఇపుడు ఏకంగా శివసేన పార్టీయే కాకుండా చేశారు. ఆ విధంగా బాలా సాహెబ్ ఫ్యామిలీని విజయవంతంగా శివసేనతో అనుబంధం లేకుండా దూరం చేయగలిగారు. మరో వైపు చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఏక్ నాధ్ షిండేదే అసలైన శివసేన అని తీర్పు చెప్పడానికి పాటించిన విధానం ఏంటి అంటే మెజారిటీ ఎమ్మెల్యేలను లెక్క చూడడమే.
మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉంటే అందులో నుంచి 40 మంది షిండే వెంటే ఉన్నారు. మొత్తం శివసేన ఎమ్మెల్యేలకు కలిపి 47,82,440 ఓట్లు పోలవగా, షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు 36,57,327 ఓట్లు దక్కాయి. మొత్తం ఓట్లలో 76 శాతం షిండే వర్గానికి దక్కగా ఉద్ధవ్ వర్గానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు 12 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఇలా అటూ ఇటూ తూకం వేసిన మీదటనే ఈసీ శివసేన విల్లూ బాణం గుర్తుకు ఏక్ నాధ్ షిండేకు కేటాయించింది.
తాజాగా మహారాష్ట్రలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే ఎన్నికల్లో అసలైన శివసేనతో కలసి బీజేపీ పోటీ చేయబోతోందని చెప్పారు. సిద్ధాంతాలను కాలరాసిన వారు తెర వెనక్కు పోయారని ఉద్ధవ్ థాక్రే మీద కామెంట్స్ చేశారు. మొత్తం మీద చూస్తే బాల్ థాక్రే ఉన్నపుడు బీజేపీ జూనియర్ పార్టనర్ గా మహారాష్ట్రలో ఉండేది. తరువాత కాలంలో తమ బలాన్ని పెంచుకోవడమే కాకుండా ఇపుడు థాక్రే వారసులనే శివసేన నుంచి లేకుండా చేసింది. ఇదే కదా అసలైన రాజకీయం అంటే అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.