Begin typing your search above and press return to search.

టీడీపీ బీసీ మ‌హిళా నేత‌కు ఎమ్మెల్సీ టికెట్‌.. బీసీల‌కు బాబు ప్రాధాన్యం!!

By:  Tupaki Desk   |   14 March 2023 9:19 AM GMT
టీడీపీ బీసీ మ‌హిళా నేత‌కు ఎమ్మెల్సీ టికెట్‌.. బీసీల‌కు బాబు ప్రాధాన్యం!!
X
ఏపీలో రాజ‌కీయం మ‌రింత వేడెక్క‌నుంది ఏకంగా 7 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 23 న జ‌రిగే ఈ పోలింగ్‌పై వైసీపీ ఇప్ప‌టికే ఏడుగురికి టికెట్లు ఇచ్చేసింది. ఎందుకంటే.. స‌భ‌లో 151 మంది స‌భ్యుల బ‌లం వైసీపీకి ఉంది. దీంతో గుండుగుత్త‌గా తామే విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ అంచ‌నా వేస్తోంది.

అయితే.. దీనికి అంటే.. వైసీపీ వ్యూహానికి గండి కొడుతూ.. చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ త‌ర‌ఫున అభ్యర్థిని బరిలోకి దింపారు.

ఈ క్ర‌మంలో టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా బీసీ(చేనేత వ‌ర్గం ప‌ద్మ‌శాలి) సామాజిక వ‌ర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను మండ‌లికి పంపాల‌ని బాబు నిర్ణ‌యించారు.

ఈ నెల 23న 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగనుండగా.. మార్చి 13తో నామినేషన్ల దాఖలు పూర్త‌యింది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం దాదాపు 23 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం ఉంటుంది. టీడీపీకి ప్ర‌స్తుతం 23 మంది స‌భ్యులు ఉన్నారు. దీంతో చంద్ర‌బాబు.. వ్యూహాత్మ‌కంగా పంచుమ‌ర్తికి అవ‌కాశం ఇచ్చారు.

ఇక‌, పంచుమ‌ర్తి అనురాధ విష‌యానికి వ‌స్తే.. 1995-2000 వ‌ర‌కు విజ‌య‌వాడ కార్పొరేష‌న్ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉన్నారు. 2009లో మంగ‌ళ‌గిరి అసెంబ్లీ టికెట్ను ఆశించారు.

కానీ, ద‌క్క‌లేదు. పార్టీ అధికార ప్ర‌తినిధిగా అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌డం ద్వారా టీడీపీ బీసీ ల‌ప‌క్ష‌పాతి అని మ‌రోసారి నిరూపించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.