Begin typing your search above and press return to search.

ఓవర్ టేక్ ఫైరింగ్; అప్పుడు ఢిల్లీలో ఉన్నాడట

By:  Tupaki Desk   |   10 May 2016 8:27 AM GMT
ఓవర్ టేక్ ఫైరింగ్; అప్పుడు ఢిల్లీలో ఉన్నాడట
X
తాను ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేసిందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీహార్ కు చెందిన ఎమ్మెల్సీ మనోరమా దేవి పుత్రరత్నం.. ఒక యువకుడి మీద కాల్పులు జరిపిన ఉదంతం తెలిసిందే. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించటతో పాటు.. సదరు ఎమ్మెల్సీ కొడుకు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహాం పోలీసుల మీద ఒత్తిడిని పెంచటంతో.. ముమ్మరంగా గాలించిన వారు.. సదరు ఎమ్మెల్సీ పుత్రరత్నాన్ని అదుపులోకి తీసుకున్నారు.

కాల్పుల ఘటన అనంతరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్.. పోలీసులకు చిక్కిన తర్వాత కొత్త వాదనను వినిపిస్తున్నాడు. తాను కాల్పులు జరపలేదని చెబుతున్నాడు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని.. ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నట్లుగా చెబుతున్నాడు. తన మీద లేనిపోని అభియోగాలు మోపుతున్నట్లుగా వాదిస్తున్న రాకీ.. తన వాదనను కోర్టులో చెప్పుకుంటానని చెబుతున్నాడు.

రాకీని అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడు వాడినట్లుగా భావిస్తున్న తుపాకీని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు. రాకీ మాటలు వింటుంటే.. చాలా సినిమాల్లో రాజకీయ నాయకుల పుత్రరత్నాల మాటలకు తగ్గట్లే ఉన్నాయి కదూ..?