Begin typing your search above and press return to search.
కొడుకు వల్ల కాదని ట్రబుల్ షూటర్ ను రంగంలోకి దించారా సారూ?
By: Tupaki Desk | 27 Feb 2021 3:30 PM GMTఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు.. లెక్క తేడా కొడుతున్నట్లు అనిపించినంతనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మేనల్లుడు హరీశ్ ఒక్కసారిగా గుర్తుకు వస్తారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తొలుత దూరం పెట్టిన హరీశ్ ను తర్వాత దగ్గరకు తీసుకోవటం తెలిసిందే. అంతకు ముందు వరకు సారు వారి సొంత మీడియాలో కనిపించని హరీశ్ బొమ్మ తర్వాత కనిపించింది.
ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కొడుక్కి పగ్గాలు అప్పజెప్పాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరగటం తెలిసిందే. అందుకే.. ఏ మాత్రం అవకాశం వచ్చినా కొడుకును ఇమేజ్ మరింత పెంచేలా ఆయనకు బాధ్యతలు అప్పజెబుతుంటారు. అలాంటి వేళ.. లెక్క తేడా కొడుతున్నట్లు అనిపించినంతనే హరీశ్ ను రంగంలోకి దించటం మామూలే. తాజాగా అలాంటిదే మరోసారి రిపీట్ అయ్యిందని చెప్పాలి.
తాజాగా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నిక విషయాల్ని మంత్రి కేటీఆరే చూసుకుంటున్నారు. దీనికి నిదర్శనంగా రెండు రోజలు క్రితం టీఆర్ఎస్ భవన్ లో నేతలతో కార్యక్రమాన్ని నిర్వహించటం తెలిసిందే. హైదరాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో భేటీ అయిన సందర్భంగా.. కేటీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయటం.. ఈసారి ఫలితం తేడా వస్తే.. వచ్చే ఎన్నికల్లో ప్రభావం పడుతుందన్న మాట అన్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఇలా అన్నీ తానై అన్నట్లు వ్యవహరిస్తున్న కేటీఆర్ సంగతిని పక్కనపెట్టిన కేసీఆర్.. తాజాగా ఈ స్థానానికి జరిగే ఎన్నికకు ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించటం గమనార్హం. దీనికి కారణం.. తొలుత అనుకున్నంత తేలిగ్గా ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం లేదన్న విషయం నివేదికల రూపంలో కేసీఆర్ కు అందటమే కారణమని చెబుతున్నారు. తమకు ఏ మాత్రం కలిసిరాని హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకోవాలంటే కొడుక్కి కాస్త ప్రాధాన్యత తగ్గించి.. మేనల్లుడ్ని రంగంలోకి దించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.
అలా అని మేనల్లుడికి గుత్తగా ప్రాధాన్యత ఇస్తే..కేటీఆర్ కు ఇబ్బంది కలుగవచ్చన్న ఆలోచనతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి తాజాగా ముగ్గురు బాధ్యుల్ని నియమించినట్లుగా చెబుతున్నారు. వీరిలో హరీశ్ తో పాటు మంత్రులు గంగుల కమలాకర్.. వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. హరీశ్ కు రంగారెడ్డి.. గంగులకు హైదరాబాద్.. వేములకు మహబూబ్ నగర్ జిల్లా బాధ్యతల్ని అప్పజెప్పారు. కొడుక్కి ఇబ్బంది కలుగకుండా.. హరీశ్ కు ట్రబుల్ షూటర్ ఇమేజ్ రాకుండా.. ఎమ్మెల్సీ గండాన్ని దాటేయాలన్న కేసీఆర్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందన్నది ఎన్నికల ఫలితం తేల్చనుంది.