Begin typing your search above and press return to search.

ఆ లేడి మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   26 Jan 2023 4:40 PM GMT
ఆ లేడి మున్సిపల్ చైర్ పర్సన్  రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే
X
తనను ఎమ్మెల్యే తీవ్ర వేధింపులకు, అవమానాలకు గురిచేస్తున్నాడంటూ మీడియా ముందు భోరుమని ఏడ్చేసి మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసింది భోగశ్రవాణి. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అయిన ఈమె జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తనను తీవ్రంగా అవమానించాడని వాపోయింది. ఈమె వ్యాఖ్యలు తెలంగాణలో.. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి.

జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రావణి నిన్న భోరుమన్నారు. తన ఆవేదన అంతా బయటపెట్టి కంటతడిపెట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్షగట్టారని.. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకూం జారీ చేశారని ఆవేదన చెందింది.. మున్సిపల్ చైర్మన్ పదవి నరకప్రాయంగా ఉందని.. నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యా.. ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానించారని.. మీకు పిల్లలు ఉన్నారు..అంటూ బెదిరించారని శ్రావణి భోరుమన్నది.

నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని.. ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలి.. కవితను కూడా కలవకూడదు.. కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని హుకూం జారీ చేశారని శ్రావణి మీడియా ముందర కన్నీళ్ల పర్యంతం అయ్యింది.. కవిత ఇంటికి వస్తే కూడా వేధింపులు ఆపలేదన్నారు. ఎమ్మెల్యేతో మా ప్రాణాలకు ముప్పు ఉందని.. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణమని... రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకుంటున్నట్టు శ్రావణి మీడియా ముందర భోరుమన్నారు.

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ఆరోపణలపై ఎట్టకేలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. తన నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. మేం తండ్రీ కూతుళ్లలా కలిసి ఉండేవారమని.. మంచి భవిష్యత్ ఉందని చాలా సార్లు చెప్పానని..

కొన్ని నెలలుగా చైర్మన్ పై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉంటే తానే సయోధ్య కుదిర్చినట్టు ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.ట్రస్ట్ అంశాన్ని తెరపైకి తెస్తే తిరస్కరించామని.. కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేశామని చెప్పినా హాజరు కాలేదని ఎమ్మెల్యే తెలిపారు. ఆమెపై అసమ్మతి కారణంగానే పదవి నుంచి తొలగిస్తారనే భయంతోనే తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.