Begin typing your search above and press return to search.

పార్టీ మార్పు పై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   29 April 2023 1:04 PM GMT
పార్టీ మార్పు పై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన
X
గోషామ హల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన పార్టీ మార్పు పై వస్తున్న ఊహాగానాల పై స్పందించారు. ఇప్పటికే పలుమార్లు ఓ వర్గాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తు పై దృష్టి పెట్టారని.. ఇందులో భాగంగానే త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై తాజాగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను టీడీపీలో చేరబోతున్నానే వార్తలను రాజాసింగ్ కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని.. తాను బీజేపీని వీడే ప్రస్తక్తి లేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని వీడనని రాజాసింగ్ కుండబద్దలు కొట్టారు. మరి రాజాసింగ్ క్లారిటీ తో ప్రచారం ఆగుతుందా? అనేది చూడాలి.

కాగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి చాలా రోజులు కావొస్తున్నా.. బీజేపీ అధిష్టానం తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాజాసింగ్ గుర్రు గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో రాజాసింగ్ చర్చలు జరిపారని.. ఆయన త్వరలోనే టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది.

అయితే తాను బీజేపీని వీడేది లేదని.. టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

గత ఏడాది ఆగస్టులో ముస్లింల మతపర మైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించడంతో ఆగస్టు 25న అతడిని జైలు కు పంపారు. బీజేపీ కూడా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్టై రెండు నెలల జైలు జీవితం గడిపిన రాజా సింగ్ నవంబర్ 9న జైలు నుంచి విడుదలయ్యాడు.

బీజేపీ తన సస్పెన్షన్‌ ను ఎత్తివేయకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలను బీజేపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. తన సస్పెన్షన్‌ ను ఎత్తివేయకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని హైదరాబాద్‌ లోని గోషామ హల్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ శాసనసభ సభ్యుడు రాజా సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీలో చేరికలపై కూడా ఖండించారు.