Begin typing your search above and press return to search.

పల్లె పోరు : ఎమ్మెల్యే మెరుగు అన్న కొడుకు ఓటమి !

By:  Tupaki Desk   |   10 Feb 2021 6:04 AM GMT
పల్లె పోరు : ఎమ్మెల్యే మెరుగు అన్న కొడుకు ఓటమి !
X
ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం జరిగిన తోలి విడత పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రంలో అత్యధిక పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినా...కొన్నిచోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. వేమూరు మండలం చంపాడు గ్రామా పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసిన ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అన్న కుమారుడు మెరుగు రాధాకృష్ణమూర్తి 51 ఓట్లతో ఓటమి చెందాడు.

ఇదే చంపాడు గ్రామంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. అయితే , ఇప్పుడు అదే గ్రామంలో సాక్ష్యాత్ ఎమ్మెల్యే కుటుంబమే బరిలో ఉన్నప్పటికీ ఓటమి చెందడం గమనార్హం. అయితే పంచాయతీ ఎన్నికలకి , శాసన సభ ఎన్నికలకి పోల్చి చూడలేము అని ఈ ఫలితం తో చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికలు అనేవి పూర్తిగా వ్యక్తిగతంగా జరుగుతాయి. అలాగే గ్రామ పంచాయతీ పరంగా జరుగుతాయి. దీనితో ఒకే పార్టీలో ఉన్నప్పటికీ .. అందరూ వారికే ఓట్లు వేస్తారు అని చెప్పలేని పరిస్థితి. ఈ తరహా ఫలితం రావడం ఇదే తొలిసారి ఏమి కాదు. అయితే , 2019 ఎన్నికలో స్పష్టమైన మెజారిటీ వచ్చి, ఏడాది దాటగానే ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే బరిలో ఉన్నప్పటికీ సర్పంచ్ పోరు లో ఓటమి చెందడం గమనార్హం.

ఇక ఈ పల్లె పోరులో వైఎస్సార్‌సీపీ ఎక్కువ స్థానాలు దక్కించుకోగా.. టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ, జనసేనలకు నామమాత్రపు విజయాలు దక్కాయి. ఇటు కాంగ్రెస్ కూడా బోణీ కొట్టింది. ఈసారి ఎన్నికల్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి ఇంకా రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది.