Begin typing your search above and press return to search.
స్థానిక పోరుతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఎమ్మెల్యే మేకపాటి వారసురాలు ..
By: Tupaki Desk | 11 March 2020 10:30 AM GMTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా విధివిధానాలని నిర్ణయించుకొని, ముందుకు సాగుతున్నాయి. ఈ ఎన్నికలని ప్రధాన పార్టీలు అన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ..ఈ ఎన్నికల ద్వారానే తమ రాజకీయ వారసులని రాజకీయాలకి తీసుకురావడానికి పలువురు ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ పదవి కోసం స్థానిక లోక్ సభ సభ్యుడు... టీడీపీ సీనియర్ నాయకుడు కేశినేని నాని.. తన రెండో కుమార్తె శ్వేతను బరిలోకి దింపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇదే కోవలో నెల్లూరు జిల్లాలో మరో రాజకీయ వారసురాలి ఎంట్రీ ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ కి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమార్తె ఆదాల లక్ష్మీ రచన రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ స్థానికంగా ప్రచారం జరుగుతుంది. నెల్లూరు లోక్ సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి కోడలు ఆమె. ఆదాల ప్రభాకర్ రెడ్డి సోదరుడి కుమారుడు వంశీధర్ రెడ్డి భార్య ఆదాల లక్ష్మీ రచన రెడ్డి. ప్రస్తుతం ఈమె ఫ్యాషన్ డిజైనర్‌గా హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్‌లో స్థిర పడినప్పటికీ.. నెల్లూరు జిల్లా రాజకీయాలపై అవగాహన ఉందని అంటున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆమె తన తండ్రి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మామ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం సాగించారు. అలాగే జిల్లాలో రెండు కుటుంబాలకి మంచి పట్టుఉండటం తో ఆమె రాజకీయ ఎంట్రీ పెద్ద కష్టం కాక పోవచ్చు అని అంటున్నారు. అలాగే ఆమెని నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. కడప జిల్లా తరువాత వైసీపీ అంత బలంగా ఉన్న జిల్లా అంటే నెల్లూరే అని చెప్పవచ్చు. ఈ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలను తన ఖాతాలో వేసుకుంది. ఉన్న ఒకే ఒక లోక్‌సభ స్థానం కూడా వైసీపీ లోకి వచ్చింది. ఈ పరిస్థితులు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం ఆపడం ఎవరితరం కాదు. దీనితో ఎన్నికలకు ముందు నుంచే జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కోసం వైసీపీలో రేసు మొదలైంది. అయితే, ఈమెకి ఆనం రామనారాయణ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబాల నుంచి తీవ్ర పోటీ ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ రెండు కుటుంబాలు కూడా జడ్పీ ఛైర్మన్ పదవి పై కన్నేశాయి. అయితే, ఆ స్థానం కోసం ఎవరు పోటీ పడినప్పటికీ ...ఆదాల రచనకు అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.