Begin typing your search above and press return to search.

గంటా రాజీనామాపై తొందరలోనే నిర్ణయం

By:  Tupaki Desk   |   23 Feb 2021 1:30 PM GMT
గంటా రాజీనామాపై తొందరలోనే నిర్ణయం
X
ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజీనామా విషయంలో తొందరలోనే నిర్ణయం ఉంటుంది. రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులకు పంపించారు. తర్వాత ఇదే విషయాన్ని గంటా స్పీకర్ తమ్మినేని సీతారమ్ తో కూడా మాట్లాడారు. అయితే గంటాతో మాట్లాడిన తర్వాత స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు సమాచారం.

రాజీనామా లేఖ సరిగ్గానే ఉందా ? లేకపోతే ఏదైనా కండీషన్లు పెట్టి రాజీనామా చేశారా అన్న విషయాన్ని స్పీకర్ నిర్ధారణ చేసుకున్నారు. తాను తొందరలోనే అమరావతికి వచ్చి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారట. అప్పుడే గంటా రాజీనామా విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారట. సర్పంచ్ ఎన్నికల్లో తమ్మినేని శ్రీమతి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు.

పంచాయితి ఎన్నికతో ఇన్నిరోజులు బిజీగా ఉన్న తమ్మినేని ఇపుడు ఫ్రీ అయిపోయారు. కాబట్టి తొందరలోనే స్పీకర్ అమరావతికి చేరుకోబోతున్నారు. స్పీకర్ రాకగురించి ఉన్నతాధికారులు ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. తొందరలోనే వస్తానని, సమావేం పెట్టి గంటా రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారట.

అయితే ఇప్పటికే రాజీనామా లేఖను అసెంబ్లీ నుండి ఫ్యాక్స్ లో తెప్పించుకుని చూశారట. కాబట్టి వీలైనంత తొందరలోనే గంటాపై స్పీకర్ నిర్ణయం తీసుకోవటం ఖాయమని అర్ధమైపోతోంది.