Begin typing your search above and press return to search.
గంటా మళ్లీ రాజీనామా.. ఎందుకంటే..?
By: Tupaki Desk | 12 Feb 2021 6:34 AM GMTఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి ఆయన తన పదవికి రిజైన్ చేశారు. దీంతో గంటా రాజీనామా టాపిక్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
మోడీ ప్రభుత్వ నిర్ణయం వేలాది మంది కార్మికుల పొట్టకొట్టే విధంగా ఉందంటూ గంటా తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్రం వెనక్కు తగ్గే వరకూ తాను పోరాటం చేస్తానని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా సాగుతున్న ఆందోళనకు మద్దతు తెలిపిన గంటా.. వైజాగ్ స్టీల్స్ కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాదని, కోట్లాదిమంది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన అంశమని అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ తోనే తాను మరోసారి రాజీనామా చేశానని తెలిపారు గంటా.
అయితే.. ఆయన మరోసారి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. మొదటిసారి ఇచ్చిన రాజీనామా లేఖ సరైన ఫార్మాట్ లో లేదని సమాచారం. అంటే.. ఒక శాసనసభ్యుడు తన పదవికి రాజీనామా చేయడానికి కొన్ని విధివిధానాలు ఉంటాయి. మొదటి లేఖలో అవి పాటించలేదని తెలుస్తోంది. దీంతో.. గంటా చిత్తశుద్ధితో రాజీనామా చేయలేదనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను పంపించారు. గంటా రాజీనామా నిర్ణయం తో ఇతర పార్టీల ఎమ్మెల్యేలపైనా ఒత్తిడి పెరుగుతోంది.