Begin typing your search above and press return to search.

కాబోయే భార్య ఎస్కేప్ అయినా పెళ్లి ఆగ‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   5 Sep 2018 7:47 AM GMT
కాబోయే భార్య ఎస్కేప్ అయినా పెళ్లి ఆగ‌ద‌ట‌!
X
రీల్ స‌న్నివేశాలు కొన్ని రియ‌ల్ లో చోటు చేసుకోవ‌టం చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. అలాంటి ఉదంత‌మే ఒక‌టి త‌మిళ‌నాడు లో చోటు చేసుకున్నది తెలిసిందే. త‌మిళ‌నాడుకు చెందిన అధికార ఎమ్మెల్యే వివాహం ఒక‌టి ఫిక్స్ కావ‌టం.. ఈ నెల 12న పెళ్లి కావాల్సి ఉండ‌టం.. కాబోయే భార్య వేరే వాడితో ఉన్న ప్రేమ‌తో చెప్ప‌కుండా ఇంట్లోనుంచి వెళ్లిపోవటం..ఈ వ్య‌వ‌హారం త‌మిళ‌నాడుతో స‌హా దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కాబోయే భార్య చెప్ప‌కుండా వెళ్లిపోవటం.. ఆమె ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌టంతో స‌ద‌రు అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వ‌ర‌న్ (ఈరోడ్ జిల్లా భ‌వానీసాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం) పెళ్లి క్యాన్సిల్ అయిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో.. స‌ద‌రు ఎమ్మెల్యే త‌న పెళ్లి మీద జ‌రుగుతున్న ప్ర‌చారంపై వివ‌ర‌ణ ఇచ్చారు.

త‌న కాబోయే భార్య (సంధ్య‌) ఇంట్లోనుంచి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ త‌న పెళ్లి జ‌రుగుతుంద‌ని.. ముందుగా అనుకున్న ముహుర్తానికి మ‌రో వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌తో త‌న పెళ్లిని కుటుంబ స‌భ్యులు ఖ‌రారు చేసిన‌ట్లు చెబుతున్నారు. త‌న పెళ్లిపై సోష‌ల్ మీడియాలో సాగుతున్న వార్త‌లు త‌ప్ప‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు కాబోయే భార్య వెళ్లిపోయిన‌ప్ప‌టికీ.. అదే ముహుర్తానికి వేరే మ‌హిళ‌ను పెళ్లి చేసుకుంటున్న వార్త ఇప్పుడు అంద‌రిని ఆక‌ర్షిస్తోంది.