Begin typing your search above and press return to search.

కమిషనర్ ఇంటి ముందు చెత్త వేసిన ఎమ్మెల్యే..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   27 July 2021 10:30 AM GMT
కమిషనర్ ఇంటి ముందు చెత్త వేసిన ఎమ్మెల్యే..ఎందుకంటే ?
X
పరిశుభ్రత పాటించాలి, అందరూ బాధ్యతగా మెలగాలి, ఎవరికివారుగా స్వచ్ఛభారత్ కోసం ముందుకు నడిచినప్పుడే పరిశుభ్రమైన దేశంగా నగరంగా మన ఈ దేశాన్ని మార్చుకోవచ్చని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా ఇంకా కొంతమంది మాత్రం ఎక్కడబడితే అక్కడే వేస్తున్నారు. ఇష్టానుసారంగా రోడ్లమీద అనే చెత్తను వేస్తూ అంతా కలుషితం చేస్తున్నారు. ఇక చెత్తను ఎత్తడంలో మున్సిపాలిటీ కి చెందిన వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంకా పలు ప్రాంతంలో చెత్త కుప్పలు దర్శనం ఇస్తూనే ఉంటాయి. అలాగే బెళగావి జిల్లాలోని బెళగావి దక్షిణ శాసనసభా నియోజకవర్గం లో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు కనిపించడం తో స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెళగావి జిల్లాలోని బెళగావి దక్షిణ శాసనసభా నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుండడంతో స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం తో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఒక ట్రాక్టర్ నిండా చెత్త నింపుకుని స్వయంగా తానే డ్రైవ్ చేస్తూ ఏకంగా బెళగావి నగర పాలికె కమీషనర్ కె. హెచ్.జగదీష్ నివాసం ముందు కుమ్మరించారు. పాలికె ఉన్నతాధికారులకు పరిస్థితి తీవ్రత గురించి తెలియ జెప్పేందుకే తాను ఇలా వినూత్న రీతిలో నిరసన చేపట్టినట్లు ఆయన మీడియకు చెప్పారు. ప్రజల కోసమే తాను ఈ పనిచేశానంటూ గట్టిగా సమర్ధించుకున్నారు. అయితే, ఎమ్మెల్యే తీరుమీద నెటిజన్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన నిరసనను మరో విధంగా తెలియజేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పాలికె సిబ్బంది కూడా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.