Begin typing your search above and press return to search.
టెక్సాస్ లో తెలుగు ప్రొఫెసర్ మృతి!
By: Tupaki Desk | 14 May 2018 10:50 AM GMTఅమెరికాలో తెలంగాణావాసి ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరా టెక్సాస్ లో నివసిస్తోన్న ఓ ప్రొఫెసర్ ప్రమాదవశాత్తూ సరస్సులో పడి మృతి చెందారు. శనివారం నాడు ఈ ప్రమాదం జరగగా..ఆదివారం నాడు ఆయన మృతదేహాన్ని సరస్సు నుంచి బయటకు తీశారు. కామారెడ్డి జిల్లా మచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి (40)డల్లాస్ లో గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆయన భార్య వాణి కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి శనివారం నాడు కుటుంబసభ్యులతో కలిసి గ్రేప్ వైన్ సరస్సులో బోటింగ్ కు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు వెంకట్రామిరెడ్డి బోటు నుంచి నీళ్లలోకి దూకారు. అయితే, ఎంత సేపటకీ వెంకట్రామిరెడ్డి పైకి రాకపోవడంతో కుటుంబసభ్యులు రెస్క్యూ సిబ్బందికి సమాచారమందించారు.
నీళ్లలో మునిగిపోయిన వెంకట్రామిరెడ్డి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆదివారం నాడు వెంకట్రామిరెడ్డి మృతదేహాన్ని సిబ్బంది కనుగొన్నారు. వెంకట్రామిరెడ్డి మృతదేహం వారం రోజుల్లో భారత్ కు చేర్చేందుకు అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి మృతితో ఆయన స్వస్థలం ఆరెపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు, లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రేప్ వైన్ ఫైర్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ చీఫ్ జాన్ షేర్‌వుడ్ తెలిపారు. ఆదివారం నాడు అదే సరస్సులో మునిగిపోయిన 25 ఏళ్ల యువకుడిని కాపాడామని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ రెండు ఘటనల్లోనూ బాధితులు లైఫ్ జాకెట్ ధరించలేదని, అది ధరించి ఉంటే ప్రమాదం సంభవించి ఉండేది కాదని ఆయన అభిప్రాయప్డడ్డారు.