Begin typing your search above and press return to search.
డాక్టర్ సూర్యకుమారి శవమై దొరికింది
By: Tupaki Desk | 6 Aug 2017 8:17 AM GMTఐదు రోజులుగా బెజవాడలో హాట్ టాపిక్ గా మారిన డాక్టర్ సూర్యకుమారి ఉదంతం ఇప్పుడు విషాదాంతంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్ స్నేహితురాలిగా చెబుతున్న ఆమె మృతదేహం నిడమానూరు రైవస్ కాలువలో గుర్తించారు. ఆమె మరణానికి కారణం ఏమిటన్నది ఇప్పడు సందేహంగా మారింది. సూర్యకుమారి హత్యకు గురైందా? ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.
బెజవాడలోని క్రీస్తురాజపురం ఫిలింనగర్ కాలనీకి చెందిన మరియమ్మ.. విజయకుమార్ దంపతులు ఉంటున్నారు. బెజవాడ కార్పొరేషన్ లో జాబ్ చేసి రిటైర్ అయిన విజయకుమార్ కు నలుగురు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు ఢిల్లీలోజాబ్ చేస్తుండగా.. కుమార్తెల్లో ఒకరు (హెబ్సిబా) కర్ణాటకలో ఐఏఎస్ గా పని చేస్తుండగా.. మరో ఇద్దరు కుమార్తెలు ఎంబీబీఎస్ చేసి వైద్యులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో 27 ఏళ్ల సూర్యకుమారి తెల్లదేవరపల్లిలో డాక్టర్ గా పని చేస్తున్నారు. మిస్సింగ్ కేసుగా తెర మీదకు రావటం.. మిస్ అయిన సూర్యకుమారి డాక్టర్ కావటం.. ఆమె స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకు కావటం.. మిస్ అయిన మహిళ సోదరి ఐఏఎస్ అధికారిణిగా వ్యవహరించటంతో ఈ వ్యవహారం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. పెద్ద చర్చకు తెర తీసింది.
ఇదిలా ఉండగా.. డాక్టర్ సూర్యకుమారి మృత దేహాన్ని తాజాగా కనుగొనటంతో ఇప్పుడామె ఎలా చనిపోయిందన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డాక్టర్ సూర్యకుమారికి.. మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. ఈ విషయం మీద ఇరు కుటుంబాల్లో గొడవల జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి అయిన విద్యాసాగర్ ను సూర్యకుమారిని వదిలేయాలని అతని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లుగా భావిస్తున్నారు. చివరకు డాక్టర్ సూర్యకుమారి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
డాక్టర్ సూర్యకుమారి మిస్ అయిన రోజు అర్థరాత్రి వేళలో ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవపడినట్లు చెబుతున్నారు. అర్థరాత్రి ఒంటి గంట వేళ ఆవేశంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన డాక్టర్ సూర్యకుమారి.. నేరుగా విద్యాసాగర్ ఇంటికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. కాసేపు వారిద్దరూ మాట్లాడుకొన్న తర్వాత సూర్యకుమారి వెళ్లిపోయింది. అయితే.. ఆమె ఫోన్ మర్చిపోయిందని విద్యాసారగ్ సూర్యకుమారి ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ఇచ్చి వెళ్లిన చెబుతున్నారు.
అయితే.. అప్పటికి సూర్యకుమారి ఇంటికి రాకపోవటంతో సందేహించిన ఆమెకుటుంబ సభ్యులు ఆమె గురించి వెతకటం మొదలెట్టారు. ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం బయటకు వచ్చింది. అలా మొదలైన మిస్సింగ్ వ్యవహారం ఐదు రోజుల తర్వాత ఆమె శవమై బయటపడ్డారు. ఐదు రోజులుగా నీళ్లల్లో ఉండటంతో ఆమె మృతదేహం గుర్తించటానికి వీల్లేని రీతిలో మారింది. అయితే.. ఆమె ఒంటి మీద ఉన్న జీన్స్ ఫ్యాంట్.. టాప్.. మెడలో బంగారు గొలుసు ఆధారంగా సూర్యకుమారిని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇప్పుడామె మరణంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో భాగంగా సూర్యకుమారి బైక్ - చెప్పులను నగరంలోని కాలువ ఒడ్డున ఉన్న సాంబమూర్తి రోడ్డు సమీపంలో గుర్తించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి రైవస్ కాలువలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో వెతికారు. ఈ క్రమంలో ఆమె మృతదేహం లభ్యమైంది.