Begin typing your search above and press return to search.
బ్యూటీ కాంటెస్టులో అద్భుతం.. 94 ఏళ్ల చరిత్రను తిరగరాసింది
By: Tupaki Desk | 29 Aug 2022 3:57 AM GMTఅందాల పోటీ అన్నంతనే ఎంతటి హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తళుకుబెళుల హంగామా.. హడావుడితో పాటు.. అదోలాంటి కలల ప్రపంచంలోకి తీసుకెళుతుంది. అక్కడ పోటీలో పాల్గొనే వారు మాత్రమే కాదు.. పోటీని తిలకించేందుకు వచ్చే వారు సైతం రోటీన్ కు కాస్తంత భిన్నంగా ఉంటారు. మొత్తంగా ఆ ప్రపంచమే వేరు. అలాంటి ప్రపంచంలో నిజం కంటే కూడా దాన్ని కప్పి ఉంచే మేకప్ కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. న్యాయ నిర్ణేతలను ఇంప్రెస్ చేసేందుకు మేకప్ విషయంలో వారు తీసుకునే శ్రద్ధ అంతా ఇంతా కాదు.
గంటల తరబడి గడిపే వారు.. కాస్ట్యూమ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది తాజాగా జరిగిన ఒక అందాల పోటీలో ఒక కంటెస్టెంట్.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. 94 ఏళ్ల 'మిస్ ఇంగ్లండ్' చరిత్రను తిరగరాసింది. ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయం.. ముఖానికి ఎలాంటి మేకప్ లేకుండా తనను తాను చూపించి.. న్యాయనిర్ణేతల తీర్పు కోరింది. ఈ ఆసక్తికర సంఘటనకు లండన్ వేదిక అయ్యింది. ఇంతకీ ఈ అద్భుత ఆలోచనకు కారణం ఏమన్నది ఆమె మాటల్లోనే వినాలి.
లండన్ కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్ వార్తల్లో వ్యక్తిగా మారారు. దీనికి కారణం ఆమె పార్టిసిపేట్ చేసిన మిస్ ఇంగ్లండ్ పోటీల్లో మిగిలిన వారికి భిన్నమైన నిర్ణయాన్ని ఆమె తీసుకోవటమే. సెమీఫైనల్ రౌండ్ లో ఆమె ఎలాంటి మేకప్ లేకుండా పాల్గొని సంచలనంగా మారారు. అందాల పోటీలో మేకప్ లేకుండా పార్టిసిపేట్ చేయటమా? అన్న సందేహం కలగొచ్చు. ఈ విషయం మీద ఆమెకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని పాటిస్తూ ఆమె మేకప్ ఫ్రీ విధానాన్ని అనుసరించారు.
అనూహ్యంగా ఆమె సూపర్ సక్సెస్ అయ్యారు. సెమీఫైనల్ గండాన్ని విజయవంతంగా అధిగమించిన ఆమె.. ఏకంగా ఫైనల్ కు దూసుకెళ్లారు. ఇప్పుడీ ఉదంతం అద్భుతంగా మారటమే కాదు. హాట్ టాపిక్ అయ్యింది. ఆమె నిర్ణయం గురించి తెలిసిన వారంతా ఆమెను విపరీతంగా అభినందిస్తున్నారు. మిస్ ఇంగ్లండ్ ఫైనల్ పోటీ అక్టోబరులో నిర్వహించనున్నారు. ఈ పోటీలోనూ ఆమె మేకప్ లేకుండానే బరిలోకి దిగాలని డిసైడ్ కావటంతో ఫైనల్ తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మిగిలిన వారికి భిన్నంగా.. మేకప్ లేకుండా పోటీలో పాల్గొనాలన్న ఆలోచన ఎందుకు? అన్న ప్రశ్ననను సంధిస్తూ మెలీసా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మేకప్ లేకుండా నేచురల్ గా స్టేజ్ మీదకు వెళ్లేందుకు తాను తొలుత భయపడినట్లుగా చెప్పారు. అయితే.. తనను తాను నిజంగా ప్రపంచానికి చూపించుకునేందుకు ఎందుకు భయపడాలి? అన్న ప్రశ్న మదిలో మెదిలి.. అదో అభయంగా మారినట్లు చెప్పారు. అందాల పోటీలకు సరిపడే ప్రమాణాలు తనలో ఉన్నాయని తానెప్పుడూ అనుకోలేదన్న ఆమె.. తన స్కిన్ టోన్ తనకు మరింత అందాన్ని ఇస్తుందన్న విషయం తెలిసిన తర్వాత మేకప్ లేకుండా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.
మనది కాని మన అందాన్ని ప్రదర్శించటం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. అందుకే అందాల పోటీకి సంబంధించిన కొన్ని ప్రమాణాల్ని ఎత్తి వేయాలని తాను అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. నిజానికి మిస్ ఇంగ్లండ్ పోటీలకు సంబంధించి 2019 నుంచి బేర్ ఫేస్ టాప్ మోడల్ రౌండ్ ను ప్రవేశపెట్టారు. పోటీలో పాల్గొనే వారు చాలామంది మేకప్ వేసుకొని వస్తారని.. అసలు వ్యక్తిని చూడాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ పెట్టినట్లుగా బ్యూటీ కాంటెస్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఏమైనా.. ఈ రౌండ్ కు భిన్నంగా పోటీ మొత్తం ముఖానికి మేకప్ అన్నది లేకుండా రెఢీ కావటం మామూలు విషయం కాదని చెప్పాలి. అందుకు మెలీసాను అభినందించాల్సిందే. మరి.. ఆమెకు ఆల్ ద బెస్టు చెబుదామా?