Begin typing your search above and press return to search.
గొడ్డుమాంసం తరిగి.. బ్రా లాగా ధరించి....
By: Tupaki Desk | 12 Nov 2017 4:42 AM GMTవెర్రి వేయి రకాలు అంటారు. వీరు ఈ పనిని వెర్రెక్కి చేయలేదు గానీ.. ఒక రకమైన నిరసనను తెలియజేయడానికి చేశారు. బ్రెజిల్ లో కొందరు అందగత్తెలు... గొడ్డు మాంసాన్ని పల్చటి పొరల్లాగా కోయించారు. వాటిని బ్రాలాగా - పేంటీలాగా - అండర్ వేర్ లాగా ధరించారు. అంతకు మించి వేరే దుస్తులేమీ వేసుకోలేదు. మోడలింగ్ రంగంలో అందగత్తెలు మామూలు బ్రాలను ధరించి వస్తే.. చూసేవాళ్లు ఆస్వాదిస్తారు గానీ.. ఇలా మాంసపు బ్రాలతో - అండర్ వేర్ లతో దర్శనమిచ్చేసరికి విస్తుపోయారు. అయితే ఈ వికృత చేష్ట మొత్తం అమ్మాయిల మీద వివక్షకు నిరసన తెలియజేయడానికి మాత్రమేనట.
విషయమేమిటంటే.. బ్రెజిల్ మిస్ బమ్ బమ్ 2017 అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు వచ్చిన అయిదుగురు అందాలభామలకు చిత్రమైన ఆలోచన వచ్చింది. ఎంటర్ టైన్ మెంట్ - మోడలింగ్ రంగాల్లోని అమ్మాయిలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని, ఆ రంగాల్లోని అమ్మాయిలను మాంసపు ముద్దల్లా చూస్తున్నారే తప్ప.. వారి వ్యక్తిత్వాన్ని గుర్తించడం లేదని కోపం వచ్చింది. అందుకే వారు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తమ నిరసన తెలియజేయాలని అనుకున్నారు.
అంతే గొడ్డుమాంసం ముక్కలను పల్చగా కోయించి.. అచ్చంగా ఆ మాంసాన్ని మాత్రమే బ్రాలాగానూ - అండర్ వేర్ లాగానూ ధరించారు. అందాల పోటీల్లో ఎలాగైతే బ్రా - అండర్ వేర్ తో హంగామా చేస్తారో.. అలాగే ఈ గొడ్డుమాంసం బ్రాలతో ఫోటోలకు ఫోజిచ్చారు. కనీసం ఈ చర్యతోనైనా అమ్మాయిలను అమ్మాయిల్లాగా చూడండి.. మాంసం ముద్దల్లా చూడొద్దు... అని వారు కోరుతున్నారు. మరి ఈ నిరసన కామాంధుల్లో కదలిక తెస్తుందో లేదో!