Begin typing your search above and press return to search.

చంద్రబాబు సైకో.. లోకేష్‌ ఐరెన్‌ లెగ్‌ సైకో: రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   28 Jan 2023 6:27 PM GMT
చంద్రబాబు సైకో.. లోకేష్‌ ఐరెన్‌ లెగ్‌ సైకో: రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!
X
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైకో అయితే.. ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ సైకో అంటూ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నారా లోకేష్‌ మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే.. వాళ్ల నాన్న చంద్రబాబుకి ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయన్నారు. మొన్న పాదయాత్ర పోస్టర్‌ ను ఆవిష్కరిస్తే 8 మంది తొక్కిసలాటలో చచ్చిపోయారన్నారు. నిన్న పాదయాత్ర చేస్తే నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి లోకేష్‌ లాంటి ఐరన్‌ లెగ్‌ రాష్ట్రం అంతా నడిస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు భయపడిపోతున్నారని రోజా చెప్పుకొచ్చారు.

లోకేష్‌ పాండిత్యాన్ని చూసి ఆయన పులకేష్‌ అనాలని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారన్నారు. రోడ్డు మీదకు వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్, ఆ పార్టీలో కొంతమంది మాత్రమేనని రోజా దుయ్యబట్టారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వైఎస్‌ జగన్‌.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని రోజా కొనియాడారు. తారకరత్నకు గుండెపోటు వస్తే లోకేష్‌ పట్టించుకోలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై మాట్లాడే అర్హత ఏ కోణంలో చూసినా లోకేష్‌ కు లేదని మండిపడ్డారు.

తన తండ్రిని అభిమానించే వాళ్ల కష్టాలు వినేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్‌.. వారి సమస్యలను తెలుసుకుని, తీర్చారని రోజా కొనియాడారు. దొంగదారిలో తన తండ్రి కేబినెట్‌లో మంత్రి అయిన లోకేష్‌ వాళ్ల నాన్నకు సంబంధంలేనివి కూడా ఆయనే నిర్మించారని చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. లోకేష్‌ అడుగుపెడితే ప్రజల ప్రాణాలు గాల్లో కలసిపోతాయన్నారు.

మహిళలను కించపరిచే తండ్రి కొడుకులు.. లోకేష్, చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో మహిళలకు భద్రత పెరిగిందన్నారు. సీఎం జగన్‌ పాలనలో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రోజా తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.