Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్రను పచ్చ మీడియా ఎక్కువగా లైవ్ లో చూపించడంలేదా...?

By:  Tupaki Desk   |   30 Jan 2023 2:00 PM GMT
లోకేష్ పాదయాత్రను పచ్చ మీడియా ఎక్కువగా లైవ్ లో చూపించడంలేదా...?
X
తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతిగా రేపటి తరం ప్రతినిధిగా నారా లోకేష్ నడుం బిగించి సాహసించి వేల కిలోమీటర్ల పాదయాత్రకు దిగిపోయారు. ఆయన అలా రోడ్లను కొలుచుకుంటూ ఏడాదికి పైగా జనంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏపీ వరకూ చూస్తే ఏ రాజకీయ నాయకుడూ నడవనంత దూరాన్ని లెక్క వేసి మరీ టార్గెట్ గా పెట్టుకుని వచ్చిన నారా లోకేష్ పాదయాత్ర ఎలా జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి మినిట్ టూ మినిట్ పాదయాత్రను పచ్చ మీడియా లైవ్ లో చూపిస్తుంది అని భావించిన వారికి షాక్ ఇచ్చేలా పచ్చ మీడియా లైవ్ కవరేజ్ పెద్దగా చేయడంలేదు అని అంటున్నారు

లోకేష్ నానా కష్టాలు పడి కాళ్ళకు పని చెబుతూ నడుస్తూంటే పచ్చ మీడియా పెద్దగా చూపించడంలేదు అని అంటున్నారు. అయితే దానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయని అంటున్నారు. ఇది కూడా వ్యూహంలో భాగమే అని అంటున్నారు. లైవ్ ఎక్కువగా చూపిస్తే తప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని ఎక్కడో ఒకచోట అలా చటుక్కున పట్టేసుకుని వైసీపీ తన సోషల్ మీడియాలో ఇట్టే ప్రసారం చేస్తుంది. దాంతోనే ఈ రకంగా చేస్తున్నారు అని అంటున్నారు.

వైసీపీ ఏ విధంగానూ చినబాబుతో ఆడుకోవడానికి వీలు లేకుండానే ఎంచుకున్న చోట్ల నుంచే లైవ్ కవరేజ్ పకడ్బంధీ ఏర్పాట్లతో ఉంటుంది అని అంటున్నారు. ఇక ఇప్పటికే లోకేష్ స్పీచ్ లో తప్పులను వైసీపీ క్యాచ్ చేసింది. కుప్పంలో ప్రశాంతత అన్న పదాన్ని లోకేష్ ప్రశాంత్ అత్త అని పలికాడు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసి పారేస్తున్నారు. యూట్యూబ్ లో కూడా రీల్స్ లో ఆ విషయం తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు సైకిల్ అన్న మాటను కూడా లోకేష్ ముద్దగా మాట్లాడింది సోషల్ మీడియా రీల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఇవే కాదు లోకేష్ మాట్లాడుతున్నపుడు డేటా కచ్చితంగా చెప్పడంలేదు అని అంటున్నారు. కొన్ని వివరాలు అయితే తప్పులు దొర్లుతున్నాయని అంటున్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏలుబడిలో రాని పధకాలు పాజెక్టులు తమ ఖాతాలో వేసుకుని ఆయన చెప్పడం కూడా వైసీపీ హైలెట్ చేసి ఘాటు విమర్శలు చేస్తోంది. ఇక లోకేష్ మాటలో కొంత ముద్దగా అర్ధం కాకుండా ఉందని దాని వల్ల ఒక పదానికి మరో పదంగా బయటకు వినిపిస్తోందని చెబుతూ దాన్ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా గతంతో పోలిస్తే లోకేష్ బాగా బెటర్ అయ్యారనే అంటున్నారు. గతంలో లోకేష్ స్పీచ్ లో చాలా తప్పులు దొర్లేవి. పావుగంటకు పైగా మాట్లాడితే పది తప్పులు ఈజీగా పట్టుకునే వారు. కానీ కుప్పంలో తొలి రోజు స్పీచ్ లో లోకేష్ ఏకంగా ముప్పావు గంట సేపు మాట్లాడితే అక్కడక్కడ తప్పులు తప్ప మెయిన్ స్పీచ్ అంతా బాగానే ఉంది అన్న రివ్యూస్ వచ్చాయి.

అయితే లోకేష్ స్పీచ్ విషయంలో వస్తున్న విమర్శ ఏంటి అంటే కొత్తదనం లేదు అని. అలాగే రొడ్డకొట్టుడు విమర్శలే ఉంటున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామని చెప్పలేకపోవడం, ఎంతసేపూ జగన్ని తిట్టడానికే టైం ని వినియోగించడం వల్ల ఆయన స్పీచ్ లు తేలిపోతున్నాయని అంటున్నారు. లోకేష్ జగన్ ని ఢీ కొట్టినట్లుగా భావిస్తున్న జనాలలో ఇంకా ఆ ఫీల్ లేదు.

దాంతో లోకేష్ తన పార్టీ గురించి చెప్పుకుంటూ పాజిటివ్ స్పీచులు ఇస్తూ పోతే జనాలకు కొంత కనెక్ట్ అవుతారు అని అంటున్నారు. మరో వైపు ఆత్మ స్తుతి పరనింద లా కాకుండా గతంలో తాము ఏమి చేయలేకపోయామో చెప్పి వాటిని ఈసారి చేస్తామని తప్పులు లేకుండా చూసుకుంటామని చెబితే జనాలు కొంత అట్రాక్ట్ అవుతారు అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ పాదయాత్ర ఇంకా స్టార్ట్ అయింది. ముందు ఉంది చాలా కధ అని అటు తెలుగుదేశం పార్టీ తో పాటు ఇటు వైసీపీ కూడా అంటోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.