బ్రేకింగ్ : ఒలింపిక్స్ నుంచి మేరీకోమ్ ఔట్..!

Thu Jul 29 2021 17:14:42 GMT+0530 (IST)

mary kom out of the Olympics

ప్రతిష్టాత్మకమైన టోక్యో ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకం నెగ్గుతుందనుకున్న బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ తీవ్ర నిరాశపర్చింది. రౌండ్ 16 పోరులో కొలంబియన్ బాక్సర్ వాల్నసీయా విక్టోరియా చేతిలో మేరి కోమ్ ఓటమి చెందింది. 3-2 తేడాతో మేరీ కోమ్ ఓటమి పాలైంది. జడ్జీలు  కొలంబియన్ బాక్సర్ వైపే మొగ్గు చూపడంతో భారత్ కు నిరాశ తప్పలేదు. ఐదుగురు న్యాయనిర్ణేతల్లో ముగ్గురు కొలంబియన్ బాక్సర్ వైపే మొగ్గు చూపారు. 30-27 29 - 28 27 -30 29- 28 28 -29 స్కోర్లు ఇచ్చారు. లండన్ బలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గిన మేరీ కోమ్ ..ఈ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని ఉవ్విల్లూరింది.కానీ లెజెండ్ బాక్సర్ కు నిరాశ తప్పలేదు. వయస్సు ప్రకారం చూస్తే మేరి కోమ్ కు కచ్చితంగా ఇది చివరి ఒలింపిక్స్. టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గురువారం విజయాల పరంపరను కొనసాగించారు. పతకాల వేటలో వడివడిగా దూసుకొని పోతున్నారు. గత కొన్ని రోజులుగా నిరాశపరుస్తున్న అథ్లెట్లు ఈ రోజు విజయాలతో అభిమానులను అలరించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలారు. అయితే మేరి కోమ్ ఓటమితో ఫ్యాన్స్ ఆశలు ఆడియాసలు అయ్యాయి. ఇండియన్ స్టార్ బాక్సర్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ గోల్డ్ కల చేజారడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. తొలి రౌండ్లోనే విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్ కు కోలుకునే అవకాశం దక్కలేదు.

తొలి రౌండ్ లో నలుగురు జడ్జీలు విక్టోరియాకు 10 స్కోరు ఇచ్చారు. అయితే రెండో రౌండ్ లో మేరీ పుంజుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. కీలకమైన మూడో రౌండ్ లో మరోసారి విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్ కు ఓటమి తప్పలేదు. భారత సీనియర్ బాక్సర్ 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ ప్రస్థానం ముగిసింది. రెండో ఒలింపిక్ పతకాన్ని ఆశిస్తున్న ఈ భారత బాక్సింగ్ దిగ్గజం గురువారం జరిగిన 51 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 16 బౌట్ లో 2–3 తేడాతో కొలంబియాకు చెందిన మూడో సీడ్ ఇన్గ్రిట్ వలెన్సియా చేతిలో ఓటమిపాలైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన 38 ఏళ్ల మేరీకోమ్ కు ఇవే ఆఖరి ఒలింపిక్స్.