మోడీ సర్కారుకు లాన్సెట్ ఇచ్చిన తాజా వార్నింగ్ ఏమిటి?

Fri Jun 18 2021 20:00:02 GMT+0530 (IST)

latest warning given by Lancet to the Modi government

సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకొంటోంది. మరికొన్ని వారాల్లోనే థర్డ్ వేవ్ విరుచుకుపడనుందన్న వార్తలు వస్తున్నాయి. థర్డ్ వేవ్ అన్నంతనే ప్రజలు వణుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత సర్కారుకు తాజా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగనున్నట్లుగా వెల్లడించింది.



ఈ సందర్భంగా మొత్తం8 కీలక సూచనలు చేసింది. అయితే.. ఈ చర్యల్ని బయోకాన్ కిరణ్ మజుందార్ షా.. టాప్ సర్జన్ డాక్టర్ దేవిశెట్టితో కూడిన ఇరవై ఒక్క మంది నిపుణులు సిఫార్సు చేయటం గమనార్హం. ఇంతకీ లాన్సెట్ చేసిన ఎనిమిది సూచనల్ని చూస్తే..

1. ఆరోగ్య సేవల్ని వికేంద్రీకరించాలి. అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధానం సరి కాదు. కేసుల తీవ్రతకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి
2.  అంబులెన్సులు.. ఆక్సిజన్ తో పాటు కరోనా వైద్యానికి అవసరమైన మందులు.. ఆసుపత్రి సంరక్షణ లాంటి ముఖ్యమైన ఆరోగ్య సేవల ధరలపై పారదర్శక.. జాతీయ ధరల విధానం అమల్లో ఉండాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేసినట్లుగా ప్రజలందరికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పథకాల్ని అమలు చేయాలి
3.  కొవిడ్ కేసులు.. వాటి నిర్వహణకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాలి. చికిత్స ఇతర సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలి. క్లినికల్ ప్రాక్టీసులు ఉన్న స్థానిక భాషల్లోనే వీటిని ప్రచురించాలి.
4.  ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రైవేటు రంగంతో పాటు అన్ని రంగాలతో అందుబాటులో ఉన్న అన్ని మానవ వనరుల్ని కరోనా సంక్షోభ వేళ వినియోగించుకోవాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలు.. బీమా..మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మార్గదర్శకాల్ని అనుసరించాలి.
5.  ఎవరికి టీకా ప్రాధాన్యత ఉందన్నది గుర్తించి.. వారికి అందేలా చేయాలి. ఇందుకోసం అవసరమైన వారిని గుర్తించి సిద్ధం చేయాలి.
6.  డేటా సేకరణ.. కేసులు తీవ్రంగా ఉన్న జిల్లాల్ని ముందస్తుగా సిద్ధం చేయాలి. బాధితులకు సంబంధించిన అన్ని వివరాల్ని రికార్డు చేయాలి. వాటిపై ట్రాకింగ్ అవసరం
8. కరోనా కారణంగా ఉద్యోగాలు పోయిన అట్టడుగు వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న నగదు బదిలీ ప్రకియకు ఆర్థిక మద్దతు అందించాలి. ఆర్థిక రంగం తిరిగి పుంజుకున్న తర్వాత ఈ సంస్థలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలి. కాంట్రాక్టులతో సంబంధం లేకుండా కంపెనీ యజమానులు కార్మికులకు ఉద్యోగ రక్షణ కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.