Begin typing your search above and press return to search.

పరస్పర అంగీకారంతో మైనర్ బాలికతో శృంగారం చేస్తే అది పోక్సో చట్టం కింద నేరం కాదు: హైకోర్టు

By:  Tupaki Desk   |   24 Sep 2021 4:30 AM GMT
పరస్పర అంగీకారంతో మైనర్ బాలికతో శృంగారం చేస్తే అది పోక్సో చట్టం కింద నేరం కాదు: హైకోర్టు
X
సాధారణంగా మైనర్ బాలికలతో శృంగారం చేస్తే పోక్సో సహా చాలా కఠినమైన చట్టాల కింద పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. తీవ్రమైన నేరంగా పరిగణించి శిక్షలు వేస్తారు. అయితే పరస్పర అంగీకారంతో ఈ శృంగారం సాగితే పోక్సో చట్టం కింద నేరమా? దీనిపైనే ఒక కేసు తాజాగా హైకోర్టుకు ఎక్కింది.

మైనర్ బాలిక అంగీకారంతో పురుషుడు ఆమెతో శృంగారం చేస్తే అది పోక్సో చట్టం కింద నేరం కాదని కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 16 ఏళ్ల అమ్మాయికి అబ్బాయితో లైంగిక సంబంధం ఉందని తెలియదని అనుకోవడం సరికాదని తెలిపింది. ఏం చేస్తున్నామో.. దాని పర్యవసనాలు ఏంటో ఆమెకు తెలుసునని కోర్టు వ్యాఖ్యానించింది.

పరస్పర అంగీకారంతో మైనర్ బాలికతో చేసిన లైంగికచర్యలో పాల్గొన్న మగవాడిని పోక్సో చట్టం కింద నేరస్థుడిగా పరిగణించలేమని కోల్ కతా హైకోర్టు తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏకాభిప్రాయంతో చేసిన లైంగిక చర్య కింద పురుషుడిపై మాత్రమే అభియోగాలు మోపలేమని తెలిపింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైన వ్యక్తి శిక్షను కోల్ కతా హైకోర్టు రద్దు చేసింది.

లైంగిక చర్యలో స్వచ్ఛందంగా పాల్గొన్న అమ్మాయి అమాయకురాలు కాదని.. లైంగిక చర్య కారణంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియకుండా ఆమె ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వకంగా చేసినప్పుడు మగవాడిని మాత్రమే నిందించడానికి ఎలాంటి కారణం లేదని జస్టిస్ సభ్యసాచి భట్టాచర్య సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది.

జడ్జి మాట్లాడుతూ ‘ఒక వ్యక్తి మైనర్ బాలికతో ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం కలిగి ఉంటే ఆ వ్యక్తి మాత్రమే బాధ్యత వహించలేడు’ అని వ్యాఖ్యానించారు.

ఈకేసులో 22 ఏళ్ల వ్యక్తి, 16 ఏళ్ల అమ్మాయితో శృంగారంలో ఆమె అంగీకారంతో పాల్గొన్నాడు. అయితే అతడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే దీనిపై బాధితురాలితో తన సంబంధం గురించి కోల్ కతా హైకోర్టులో బాధితుడు పిటీషన్ దాఖలు చేశాడు. ఆమె ఇష్టంతోనే లైంగిక చర్యలో పాల్గొన్నానని తెలిపాడు. 2017లో తాను కూడా మైనర్ అని.. ఇప్పుడు మేజర్ అయ్యానని వివరించాడు. ఈ కేసులో ఇద్దరూ ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధాలు కొనసాగించామన్నారు. దీంతో హైకోర్టు పోక్సో చట్టం కింద ఇది నేరంగా పరిగణించలమేని ఆ పురుషుడిని నిర్ధోషిగా ప్రకటించి విడుదల చేసింది.