Begin typing your search above and press return to search.
కృష్ణా వాటా మీద ‘‘కేసీఆర్’’ వాదన ఇదే
By: Tupaki Desk | 9 July 2016 4:45 AM GMTనీటి కేటాయింపుల మీద తమకు అన్యాయం జరుగుతుందన్న వాదనను వినిపించే తెలంగాణసర్కారు.. అందుకు తగ్గట్లే పదునైన వాదనను సిద్ధం చేసింది. తాజాగా కృష్ణా జలాల నీటి కేటాయింపుల మీద బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ రాష్ట్ర సర్కారు తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఎప్పుడూ చెప్పినట్లే.. కృష్ణా జలాల కేటాయిపుంలో తెలంగాణకు దారుణమైన అన్యాయం జరిగిందన్న వాదనను వినిపిస్తూ.. అందుకు ఉదాహరణలుగా కృష్ణా పరివాహక రాష్ట్రాల కేటాయింపులను పోలుస్తూ వాదనను వినిపించారు. తెలంగాణ సర్కారు తరఫున వైద్యనాథన్ వినిపించిన వాదనను చూస్తే..
= కృష్ణా నది పరీవాహక ప్రాంతమైన మహారాష్ట్రాలో 27 శాతం సాగు విస్తీర్ణం ఉంది. ఆ రాష్ట్రానికి 27.5 శాతం నీటిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు 8 శాతం మాత్రమే సాగు విస్తీర్ణం ఉంది.. కానీ ఆ రాష్ట్రానికి 22.4శాతం నీటిని కేటాయించారు. అదే సమయంలో తెలంగాణకు 20 శాతం సాగు విస్తీర్ణం ఉంది. అయితే.. నీటి కేటాయింపులు మాత్రం 12.8 శాతం మాత్రమే. తెలంగాణ అవసరాలకు భిన్నంగా తక్కువ నీటిని కేటాయించారు. ఏ లెక్కన చూసినా తెలంగాణకు 450 నుంచి 500టీఎంసీల నీటి వాటా ఉండాల్సిన అవసరం ఉంది.
= తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది కృష్ణా పరివాహాక ప్రాంతంలో నివసిస్తున్నా.. అందుకు అనుగుణంగా వాటా దక్కలేదు. నీళ్లు.. నియామకాల్లో అన్యాయం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందుకే తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే ఇచ్చారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి 105.7 టీఎంసీలు.. శ్రీశైలం నుంచి 89.15 టీఎంసీలు.. ఆర్డీఎస్ నుంచి 15.9.. జూరాల నుంచి 17.8 టీఎంసీలు వాడుకోవాలని ఉన్నా.. సగటున 262 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ వాడుకుంటోంది.
= తెలంగాణకు కేటాయించిన 50 టీఎంసీల నీరు రాష్ట్రానికి రావటం లేదు. ఏపీకి కేటాయించిన నీటిలో కృష్ణా బేసిన్ దాటి వాడుకొంటోంది. మూసీకి కృష్ణా నుంచి 9.4 టీఎంసీలు రావాల్సి ఉన్నా 3 టీఎంసీలు మాత్రమే వదులుతున్నారు. ఏపీకి కేటాయించిన నీటితో పాటు తెలంగాణకు కేటాయించిన నీటిని కూడా కేసీ కెనాల్.. సాగర్ కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు తరలించుకుపోతున్నారు.
= కర్ణాటక నుంచి తెలంగాణకు సరైన వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి తుంగభద్ర నుంచి 350 టీఎంసీలు తెలుగు రాష్ట్రాలకు రావాల్సి ఉంది. గత ఏడాది కేవలం 127 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. కర్ణాటక మాత్రం 460 టీఎంసీలు వాడుకుంటోంది. దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నీటిని వాడుకోలేకపోతున్నాయి.
= కృష్ణా బేసిన కింద రెండో పంటను వేయటానికి అనుమతించొద్దు. రెండో పంట కారణంగా కింది రాష్ట్రాలకు చట్టపరంగా రావాల్సిన నీరు రావటం లేదు. మహారాష్ట్రకు 465 టీఎంసీలు అవసరం ఉన్నా.. అందుకు భిన్నంగా 585 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. (ఈ సందర్భంగా మహారాష్ట్ర వాడుకుంటున్న నీటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా? అని అడగ్గా.. లేవని.. ఎన్నిసార్లు అడిగినా ఆ రాష్ట్రం లెక్కలు ఇవ్వటం లేదని బ్రిజేష్ కు చెప్పటం గమనార్హం)