Begin typing your search above and press return to search.
జన సేనకు కేసీఆర్ మళ్లీ ఝలక్
By: Tupaki Desk | 12 Jan 2023 2:30 AM GMTతెలంగాణ వాదంతో మొదలైన టీఆర్ఎస్ నుంచి జాతీయ వాదంతో బీఆర్ఎస్ గా మారి.. తొలి అడుగును పొరుగునున్న ఏపీలోనే వేస్తున్న సీఎం కేసీఆర్ ఈ క్రమంలో జన సేన పార్టీకి మరోసారి భారీ ఝలక్ ఇచ్చారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ వంటివారిని లాగేసుకుని పవన్ కల్యాణ్ సామాజిక వర్గాన్ని కొంత సందిగ్ధంలో పడేసిన కేసీఆర్ మరోసారి జన సేనను దెబ్బతీసేలా కనిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జనసేన పార్టీ సలహాదారు, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారధి, తదితరులున్నారు. వీరి భేటీకి బుధవార ప్రగతిభవన్ వేదికైంది. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు, ఇతర విషయాలపై కేసీఆర్‌తో చర్చించారు. తెలంగాణ సీఎస్‌గా శాంతికుమారిని నియమించినందుకు కేసీఆర్‌కు.. రామ్మోహన్‌రావు, భారాస ఏపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సీఎస్ శాంతికుమారిని అభినందించారు.
రామ్మోహన్ రావు వయా తమిళనాడు, ఏపీ
ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రామ్మోహన్ రావు ఐఏఎస్ అధికారి. తమిళనాడు జయలలిత హయాంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. జయలలిత ఆస్ప్రతి పాలైనప్పుడు రామ్మోహన్ రావే ప్రభుత్వాన్ని నడిపారని చెబుతారు. అయితే, జయ అకాల మరణం, ఆమె పార్టీ ఏఐఏడీఎంకేలో వర్గ విభేదాలు, రామ్మోహన్ రావుపైనా ఆరోపణలు ఇలా తర్వాత చాలా కథ నడిచింది. అయితే, రామ్మోహనరావు రిటైర్ అయ్యాక ఏపీకి వచ్చేశారు. అంతేకాక.. జన సేన పార్టీలో సలహాదారుగా ఉన్నారు. అధినేత పవన్ కల్యాణ్ సామాజిక వర్గమైన కాపు కులానికి చెందిన రామ్మోహన్ రావుకు మంచి అడ్మినిస్ట్రేటర్ గానూ పేరుంది. తమిళనాడులో జయలలిత విజయం వెనుక ఆయన పాత్రే కీలకమని చెప్పేవారు.
ఆయన బీఆర్ఎస్ లోకి పక్కా?
సివిల్ సర్వెంట్ గా విశేష అనుభవం, ఏపీ స్థానికత ఉన్న రామ్మోహన్ రావు జన సేనకు ఝలక్ ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ఏకంగా తో చంద్రశేఖర్ తో కలిసి కేసీఆర్ ను కలవడం దీనికే సంకేతం. మరోవైపు కేసీఆర్ కూడా ఇప్పటికే చంద్రశేఖర్ ను చేర్చుకుని జన సేనకు ఆర్థిక, సేవా వనరును దెబ్బతీశారు. ఇప్పుడు రామ్మోహన్ రావునూ చేర్చుకుంటే మేధో పరంగా జన సేనకు దెబ్బే కానుంది. కాగా, సంక్రాంతి తర్వాత ఏపీలో భారాస కార్యకలాపాలు ఊపందుకుంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది.
దీనికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరుకానున్నారు. ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని, నిర్మాణాత్మ వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని ఇటీవల పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉందని, పెద్దఎత్తున చేరికలుంటాయని భారాస నేతలు చెబుతున్న నేపథ్యంలో.. మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు.. సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.