Begin typing your search above and press return to search.
కేసీఆర్ సాబ్...వాళ్ల గోడు పట్టించుకోండి
By: Tupaki Desk | 10 Jan 2016 10:27 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల్లో గులాబీని గుభాలించేలా చేసిన వరంగల్ ప్రజలకు 30వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. నగరంలో 700 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించామని, పేదల ఇళ్ల నిర్మాణాల కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఇందుకోసం అర్హులైన ప్రతి ఒక్కరు సంబంధిత తహసీల్ కు గానీ నేరుగా కలెక్టర్ కు గానీ దరఖాస్తు చేసుకోవాలని సీఎం కోరారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్జిదారుడి పేరు వార్డుసభలో డిస్ ప్లే చేస్తామని చెప్పారు.
కేసీఆర్ నిర్ణయం ఆహ్వానించదగ్గదే అయితే...కేసీఆర్ తన పార్టీని గెలిపించిన నగరానికే ఇంత చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తను దత్తత తీసుకున్నా గ్రామాన్ని ఎందుకు ఇక్కట్ల పాలు చేస్తున్నారనే సందేహం కలుగుతోంది. గ్రామజ్యోతి పథకం కింద కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ములుకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ తన సొంత గ్రామంలా అభివృద్ధి చెందిస్తానని ప్రకటించారు. గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నెలలో గ్రామంలో ఉన్న 120 గుడిసెలను కూల్చివేశారు. ఇప్పటి వరకు ఆ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను చేపట్టకపోవడంతో గుడిసె వాసులంతా రోడ్డుపై పడ్డారు!
ఇటు ఉన్న ఇళ్లు లేక అటు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణం కాకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తర్వాత కూడా వారికి ఇళ్ల నిర్మాణం ప్రారంభ కాకపోవడం కొసమెరుపు. అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ నిలుపుకొని ఉంటే గుడిసెవాసులకు గూడు దొరికేది...కేసీఆర్ కు ఖ్యాతి పెరిగేది. కేసీఆర్ వరంగల్ పై చూపిన మమకారాన్నే దత్తత గ్రామాలపై కూడా చూపాల్సిన అవసరం ఉందేమో.