Begin typing your search above and press return to search.

ఈ ఫోటో కానీ కేసీఆర్ చూస్తే.. ఇక అంతే!

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:47 AM GMT
ఈ ఫోటో కానీ కేసీఆర్ చూస్తే.. ఇక అంతే!
X
రాష్ట్ర విభ‌జ‌న మీద జోరుగా ఉద్య‌మం సాగుతున్న వేళ‌.. టీఆర్ఎస్ అధినేత హోదాలో ఉన్న కేసీఆర్ చెప్పే మాట‌లు ఆస‌క్తిక‌రంగా ఉండేవి. విభ‌జ‌న అన్న‌ది అంత తేలికైన వ్య‌వ‌హారం కాద‌ని.. దానికి బోలెడంత ప్రొసీజ‌ర్ ఉంద‌న్న మాట‌ను ప‌లువురు చెప్పేవారు.

వీరిని మాట‌ల‌కు బ్రేకులు వేస్తూ.. కేసీఆర్ చాలా సింఫుల్ గా చెప్పేశారు. ఆయ‌న మాట‌ల్ని విన‌ప్పుడు విభ‌జ‌న ప్రొసీజ‌ర్ మ‌రీ ఇంత సులువా? అన్న భావ‌న క‌లిగేది. ఇంత‌కీ.. కేసీఆర్ చెప్పిన మాట‌ను చూస్తే.. కేంద్రం కానీ ఏపీ విభ‌జ‌న‌కు ఓకే అంటే.. మ‌హా అయితే ఐదారు గంట‌ల్లో విభ‌జ‌న ప్ర‌క్రియ మొత్తం పూర్తి అవుతుంద‌ని.. రోజు వ్య‌వ‌ధిలో అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల బోర్డులు.. సూచిక‌ల్ని మొత్తంగా మార్చేయొచ్చ‌న్న ధీమాతో చెప్పేవారు.

మ‌రి.. ఆచ‌ర‌ణ‌లో అది సాధ్య‌మైందా? అంటే నో చెప్పాలి. కేసీఆర్ చెప్పిన‌ట్లు ఒక‌ట్రెండు రోజులేంది ఖ‌ర్మ‌.. దాదాపు నాలుగున్న‌రేళ్లు గ‌డిచిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికి మార‌ని అంశాలెన్నో ఉన్నాయి. కేసీఆర్ మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న తేడా ఇప్పుడు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

మిగిలిన విష‌యాల్ని వ‌దిలేస్తే.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి నాలుగున్న‌రేళ్ల జ‌రిగిన త‌ర్వాత కూడా ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రి పేరు మార‌క‌పోవ‌టం.. ఇప్ప‌టికీ ఏపీ రాష్ట్రంలో ఉన్న‌ట్లే ఉన్నామ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా తాండూరులోని 200 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిగా చెప్పాలి. ఇప్ప‌టికీ ఈ ఆసుప‌త్రి బ‌య‌ట చూస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ పేరుతోనే కొన‌సాగుతోంది. ఇలాంటి ఫోటోలు కానీ సీఎం కేసీఆర్ చూస్తే.. ఒళ్లు మండ‌కుండా ఉంటుందా? విభ‌జ‌న జ‌రిగిన నాలుగున్న‌రేళ్ల‌కు కూడా బోర్డులు మార్చ‌టంలో ఇంత నిర్ల‌క్ష్యాన్ని ఎలా ప్ర‌ద‌ర్శిస్తార‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.