Begin typing your search above and press return to search.
మనలో మనమాట.. ప్రైవేటు ఆపరేటర్లు వెర్రి పుష్పాలా?
By: Tupaki Desk | 3 Nov 2019 3:45 AM GMTఅంచనాలకు తగ్గట్లే శనివారం రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన మారథాన్ మంత్రిమండలి భేటీ తర్వాత సుదీర్ఘ మీడియా సమావేశానికి తెర తీశారు. ఈ సందర్భంగా తనను ప్రశ్నలతో చిరాకు పెట్టే పాత్రికేయులకు మొదట్లోనే కటువుగా సమాధానం ఇస్తూ.. ప్రశ్నలు అడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సుమా అన్న సిగ్నల్ ఇచ్చేశారు.
ఎప్పటిలానే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమైనదని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్న మాట పదే పదే చెప్పేస్తూ..తన వైఖరి ఏ మాత్రం మారలేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. కాకుంటే.. ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరే విషయంలో మాత్రం తాను మెట్టు దిగినట్లు వ్యవహరించారు. ఇన్నిరోజులు సమ్మె చేసిన తర్వాత.. వారి డిమాండ్లలో ఏ ఒక్క దానికి ఓకే అనకుండా.. సమ్మె కాలానికి కోల్పోయిన జీతాల్ని వెంటనే ఇస్తామన్న మాట లేకుండా.. భేషరతుగా మంగళవారం అర్థరాత్రి లోపు డ్యూటీలోకి చేరాలని తేల్చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం మీద పెద్ద ఎత్తున చర్చ చేశామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేయకూడదని నిర్ణయించినట్లుగా తేల్చేశారు. అంతేకాదు..గతంలో తాను రవాణా శాఖామంత్రిగా పని చేసిన అనుభవంతో 5100 బస్సులను ప్రైవేటు వారికి రూట్ పర్మిట్లు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లుగా చెప్పారు.
ఆరోగ్యకరమైన పోటీ.. మెరుగైన రవాణా సదుపాయాల కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. పర్మిట్లు ఇచ్చే విధానం యథాతధంగా కొనసాగుతుందని.. లాభాలు వచ్చే రూట్లు ఆర్టీసీకే ఉంటాయని చెప్పారు. కఠినమైనవి.. పల్లెవెలుగు బస్సుమార్గాలు ప్రైవేటు వారికి ఇస్తామని చెప్పారు. ప్రైవేటు రూట్లలో ఇష్టానుసారం ఛార్జీలు పెంచటానికి వీల్లేదని.. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఛార్జీల నియంత్రణ కమిషన్ ఉంటుందని చెప్పారు. బస్ పాస్ రాయితీలు కొనసాగతాయని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ మాటల్ని విన్నంతనే.. అంతా బాగున్నట్లు అనిపించినా.. కాస్త తర్కబద్దంగా ఆలోచిస్తేనే సందేహాలు బోలెడన్ని రావటం ఖాయం. సీఎంసాబ్ చెప్పినట్లు.. కఠినమైనవి.. పల్లెవెలుగు రూట్లు ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తారనే అనుకుందాం? అలాంటి రూట్లను నడిపేందుకు ఓకే అని చెప్పి ముందుకు వచ్చే ఎర్రిపుష్పాలు ఉంటాయా? అన్నది ప్రశ్న. లాభాలు వచ్చే రూట్లు ఆర్టీసీకి.. నష్టాలు.. కష్టాలు వచ్చే రూట్లు ఏమో ప్రైవేటు బస్సులకు ఇస్తామన్న విషయాన్ని సీఎం ఓపెన్ గా చెప్పేస్తున్నప్పుడు.. వ్యాపారం చేసే వారెవరైనా నష్టాలు వచ్చే రూట్లను నడిపే ప్రైవేటు ఆపరేటర్ ఎవరన్నది ప్రశ్న?
సమ్మె కాలంలో మామూలు చార్జీల కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ.. ఛార్జీల దోపిడీ ఎంతలా సాగిందో ఇప్పుడు చూస్తున్నదే. అదే రీతిలో రేపొద్దున కఠినమైన రూట్లను తీసుకునే వారు తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తే ప్రజలు మాత్రం ఏం చేయగలరు?
ముందు సర్దుకుందాం.. తర్వాత చూద్దామని ఎవరైనా ముందుకు వచ్చి.. నష్టాలు గూబ గుయ్యమనేలా ఉంటే.. సర్వీసుల్ని తగ్గించేస్తే.. ఆ కారణంగా ప్రజలు పడే కష్టాలకు ప్రభుత్వం అదే పనిగా సమాధానం చెబుతూ ఉంటుందా? అన్నది సందేహమే. ఎక్కడి దాకానో ఎందుకు? ప్రైవేటు బస్సులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నారా? రేపొద్దున కఠినమైన రూట్లలో పర్మిట్లు పొందే వారు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే ప్రజల పక్షాన ఉండేవారెవరు? అన్న సందేహానికి మాత్రం సారు సమాధానం ఏ మాత్రం సూట్ కావట్లేదని చెప్పక తప్పదు.