Begin typing your search above and press return to search.

10 ఇయర్స్ ఛాలెంజ్.. కేసీఆర్ లో ఎంత మార్పు!

By:  Tupaki Desk   |   18 Jan 2019 4:21 PM GMT
10 ఇయర్స్ ఛాలెంజ్.. కేసీఆర్ లో ఎంత మార్పు!
X
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 10 ఇయర్స్ ఛాలెంజ్ ను కేసీఆర్ రాజకీయ జీవితానికి ముడిపెట్టే చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకొస్తాయి. పదేళ్ల కిందట కేసీఆర్ ఓ ఉద్యమ నాయకుడు మాత్రమే. కట్ చేస్తే - పదేళ్ల తర్వాత కేసీఆర్ తెలంగాణ శక్తి. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ జాతిపిత అనే గౌరవం దక్కించుకున్నాడు.

10 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమం జోరుగా సాగింది. కేసీఆర్ - హరీష్ రావుతో పాటు ఎంతోమంది ప్రముఖులు రోడ్లమీద కొచ్చి వంటావార్పు కార్యక్రమాలు - రాస్తారోకోలు చేశారు. పొద్దున్న లేస్తే ఎండలో పడి ఉద్యమాలు చేయడం, సాయంత్రం సేదతీరడం.. మరోవైపు పార్టీ కార్యకలాపాలు ఇలా సాగాయి అప్పట్లో కేసీఆర్ రోజులు.

ఈ పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ శక్తిగా మారారు. వరుసగా రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లి తన శక్తిని మరోసారి చాటిచెప్పిన కేసీఆర్ - ఈ పదేళ్లలో జాతీయ రాజకీయాల్ని సైతం ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. నిజంగా ఇది రాజకీయాల్లో కేసీఆర్ విసరదగ్గ 10 ఇయర్స్ ఛాలెంజ్.