Begin typing your search above and press return to search.
కేసీఆర్ రాలేదు.. సభలో కేటీఆర్ కీరోల్.. కథేంటి?
By: Tupaki Desk | 5 Feb 2023 1:18 PM GMTతెలంగాణలో సాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోకేటీఆర్ కీ రోల్ గా కనిపించారు. సమావేశాల మొదటి రోజు మెరిసిన కేసీఆర్ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే సభలో అధినేత కనిపించలేదు. అయితే ఆ బాధ్యతను కేటీఆర్ నిర్వహించారు. వాస్తవానికి కేసీఆర్ లేని సమయంలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు మంత్రి జగదీశ్ రెడ్డి, హరీశ్ రావులు సమాధానం ఇచ్చే వారు. అలాగే సభా వ్యవహారాలు సజావుగా నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతిపక్షాలను కోరేవారు. కానీ ఈ బాధ్యతలన్నీ శనివారం కేటీఆర్ నిర్వహించారు. కేసీఆర్ నిర్వహించే బాధ్యతలన్నీ కేటీఆర్ నిర్వహించడంపై ఇక నుంచి రాష్ట్రాధినేత కేటీఆర్ నేనా? అన్న చర్చ మొదలైంది.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత పక్క రాష్ట్రం ఏపీలో కమిటీ వేశారు. కానీ తెలంగాణలో ఇప్పటి వరకు అధ్యక్షుడు ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ఈ అవకాశాన్ని ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ కే ఇస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఆ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాల్లో కేటీఆర్ కనిపించడం లేదు. ఏదో ఒక సాకుతో బీఆర్ఎస్ మీటింగ్ లకు గైర్హాజరవుతున్నారు. దీంతో కేటీఆర్ కు బీఆర్ఎస్ గా మారడం ఇష్టం లేదా..? అని చర్చించుకున్నారు. కానీ తాజాగా ఆయన ప్రవర్తనపై అంతా షాక్ తిన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. సమావేశాల ప్రారంభం రోజున ప్రతిపక్షాల నాయకుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో హుజూరాబాద్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆ తరువాత తనకు ఆహ్వానం లేదని ఈటల బదులిచ్చారు. మిగతా సభ్యుల వద్దకు వెళ్లి సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని అందరినీ కోరారు. రెండో రోజు మొత్తం కేటీఆర్ వాయిసే వినిపించింది. ఈ సభలో కేసీఆర్ రాకపోవడంతో ఆయన నిర్వహించే బాధ్యతనంతా కేటీఆర్ నిర్వహించారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కేటీఆరే సమాధానం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్ లో రాష్ట్ర అసెంబ్లీలో కేటీఆర్ దే మార్క్ కనిపించనుందని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత కేటీఆర్ ఇక రాష్ట్ర బాధ్యతలు చూసుకోవడంపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. కొందరు ప్రతిపక్షాలు సైతం కేసీఆర్ కంటే కేటీఆర్ పైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు అందరితో కలుగొలుపు తనాన్ని కేటీఆర్ ఎప్పుడో అలవర్చుకున్నారని బీఆర్ఎస్ నాయకుల్లో చర్చ సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.